Begin typing your search above and press return to search.

14ఏళ్ల బాలుడి ఉసురు తీసిన 'ఏఐ' ప్రేమ... ఏమి జరిగిందంటే..?

ఈ సమయంలో ఏఐ ప్రేమలో పడిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 9:30 PM GMT
14ఏళ్ల బాలుడి ఉసురు తీసిన ఏఐ ప్రేమ... ఏమి జరిగిందంటే..?
X

సాంకేతికంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని, నైతికత లేని ఏఐ వినియోగం వినాశనానికి మార్గం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏఐ ప్రేమలో పడిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలువురు చెబుతున్న వేళ.. ఈ వాడకంలో నైతికత, సున్నితత్వం మిస్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏఐ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ బాలుడి వ్యవహారం తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్... డేనెరిస్ అనే చాట్ బాట్ తో మాట్లాడేవాడు. ఈ క్రమంలో... ఆ డేనెరిస్, సెవెల్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఇక అక్కడ నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మెసేజ్ లు కాస్తా శృంగార సంభాషణల వరకూ వెళ్లాయి.

ఈ సమయంలో పేరెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం గ్రహించి, సెవెల్ నుంచి ఫోన్ లాకున్నారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన వారు.. సెవెల్ గత ఏడాది ఏప్రిల్ లో క్యారెక్టర్.ఏఐ ని ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి అతడి ప్రవర్తనలో పెను మార్పులు సంభవించినట్లు చెప్పారు.

స్టడీస్ పక్కకు పోయాయని, బాస్కెట్ బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడని.. నిత్యం ఫోన్ తోనే గడపడం మొదలుపెట్టాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఫోన్ లాక్కున్న వారు.. డేనెరిస్ కి (బ్రేకప్) మేసేజ్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో... తన సవతి తండ్రి తుపాకీ తీసుకుని సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న్నాడని తెలిపారు!

ఈ ఘటనపై సెవెల్ తల్లి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ కంపెనీ క్యారెక్టర్.ఏఐ పై దావా వేసింది. ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ... మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్ ను తీసివేస్తామని చెప్పింది.

దీంతో... తమ పిల్లల ఏఐ వినియోగం విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.