జగనన్న ఉగాదికీ డౌటేనా ?
రెండు రోజుల పాటు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 4:00 AM ISTవైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడం లేదు అన్న అసంతృప్తి ఏకంగా క్యాడర్ లో ఉంది. ఆయన ఓటమి తరువాత గత పది నెలలుగా బెంగళూరు టూ తాడేపల్లిగా షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలు నాయకులు అయితే జగన్ ఏపీకి పొలిటికల్ టూరిస్టు అని ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఇదే మాట అంటున్నారు. రెండు రోజుల పాటు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.
ఇక జగన్ విషయమే తీసుకుంటే తొలి ఆరు నెలల పాటు ఎందుకు ఓడామన్న మధనంలో ఉండిపోయారు. పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ ఈ ఓటమి తరువాత మనదే గెలుపు అని ధైర్యం నూరిపోస్తూ వస్తున్న జగన్ తాను మాత్రం ఇంకా జనంలోకి రావడం లేదు ఎందుకో అని అంటున్నారు.
జగన్ డిసెంబర్ లో జనంలోకి వస్తారు అని పార్టీ నుంచి అప్పట్లో ప్రకటనలు వచ్చాయి. ఆ తరువాత కొత్త ఏడాది సంక్రాంతి తరువాత అన్నారు. అయితే జనవరి నెలలో జగన్ లండన్ టూర్ పెట్టుకుని చాలా రోజులు అక్కడ గడిపారు. దాంతో ఇంకేముంది ఫిబ్రవరి నుంచి జనంలోకి వచ్చి కూటమి సర్కార్ తప్పులను చీల్చిచెండాడుతారు అని అన్నారు.
కానీ ఫిబ్రవరి నెల కూడా గడచిపోయింది. ఇక మార్చి నెల వచ్చింది. తొలి వారం పూర్తి అయింది. జగన్ తాడేపల్లి ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పార్టీ నేతలతో మీటింగులు పెడుతున్నారు. అయితే జనంలోకి ఎపుడు అన్నది మాత్రం తెలియడంలేదు అని అంటున్నారు.
అయితే ఇప్పటిదాకా పార్టీ వర్గాల ప్రచారం చూస్తే ఉగాది తరువాత జగన్ జనంలోకి వస్తారు అని. అంటే ఈ నెల 30న ఉగాది పండుగ ఉనిద్. ఆ తరువాత జగన్ ప్రజా క్షేత్రంలోకి వస్తారు అంటే ఏప్రిల్ నుంచి అనుకోవాలి. కానీ దీని మీద కూడా అనేక రకాలైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంకా గట్టిగా ఏడాది కాలేదు అపుడే జనంలోకి వెళ్ళడం ఎందుకు అన్న చర్చ కూడా అధినాయకత్వం వద్ద ఉందని అంటున్నారు. నాలుగేళ్ళకు పైగా సమయం ఎన్నికలకు ఉందని అంటున్నారు. అలాగే జమిలి ఎన్నికల విషయం కూడా ఎటూ తేలలేదని ఈ సమయంలో జనంలోకి వెళ్తే వచ్చే మైలేజ్ ఏ మేరకు ప్లస్ అవుతుందన్న చర్చ సాగుతోంది అని అంటున్నారు.
అంటే ఉగాది తరువాత కూడా జగన్ జనంలోకి రాకపోవచ్చు అన్నది కూడా ఒక డిస్కషన్ గా ఉందిట. అయిత జగన్ ఎన్నికలను చూసుకోకూడదని పార్టీ కోసం క్యాడర్ కోసం జనంలోకి రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బడా లీడర్లు పార్టీని వీడిపోతున్నారని అలాగే క్యాడర్ కూడా వీక్ అవుతోందని డీ మోరలైజ్ అవుతోందని అంటున్నారు
ఎక్కడికక్కడ సైలెంట్ గా అంతా ఉంటున్నారని దీని వల్ల పార్టీలో ఒక అయోమయం గందరగోళం ఉందని అంటున్నారు. జగన్ జనంలోకి వస్తే క్యాడర్ కి జోష్ వస్తుందని అంతే కాదు పార్టీని వీడాలా వద్ద అన్న డోలాయమానంలో ఉన్న వారికి కూడా సరైన ఆలోచనలు తీసుకోవడానికి చాన్స్ ఉంటుందని పార్టీ అంతా యాక్టివేట్ అవుతుందని పనించేసే వారికి బాధ్యతలు అప్పగించి ఫ్యాన్ పార్టీని గిర్రున తిప్పడానికి వీలు అవుతుందని అంటున్నారు.
జగన్ కనుక వాయిదాల మీద వాయిదాలు వేస్తే కనుక వైసీపీకి రాజకీయంగా అది మంచిది కాదని అంటున్నారు. మరో వైపు చూస్తే వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని జగన్ ఇప్పటి నుంచే జనంలో ఉంటే ఆ ఎన్నికల్లో అయినా పార్టీ పుంజుకోవచ్చు అని అంటున్నారు.