'అండ' కొండ కరిగిపోతే.. జగన్ ఏం చేస్తున్నారు ..!
ఇక, ఇప్పుడు పరిస్థితి చూస్తే.. వైసీపీ అధినేత జగన్‌కు అండ కరిగిపోతోందన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 10 March 2025 1:00 PM ISTరాజకీయాల్లో ఉన్నవారికి వివిధ వర్గాల అండ ఎంతైనా అవసరం. అదేసమయంలో వివిధ సామాజిక వర్గా ల వారి మద్దతు కూడా అంతే అవసరం. సో.. ఎక్కడా ఏ వర్గాన్నీ.. ఈ కులాన్నీ దూరం చేసుకునేందుకు నాయకులు సాహసించరు. 2019-24 మధ్య చంద్రబాబు చాలా వ్యూహాలతో ముందుకు సాగారు. అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఫలితంగా అప్రతిహత విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు పరిస్థితి చూస్తే.. వైసీపీ అధినేత జగన్‌కు అండ కరిగిపోతోందన్న చర్చ సాగుతోంది.
2019 ఎన్నికల్లో అన్ని వర్గాలు ఏకమై... జగన్‌ను గెలిపించాయి. అయితే.. అవే వర్గాలు ఇప్పుడు ఆయనను దూరం పెట్టాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. దాదాపు 10 మాసాలు అయిపోయినా.. ఆయా వర్గాలు ఇప్పటి కీ చేరువ కాలేదు. ''జగన్ తీరు మారలేదు. ఆయన ఇంకా భ్రమల్లోనే ఉన్నాడు'' అని కీలకమైన రెడ్డి సామాజిక వర్గం చెబుతున్నదంటే.. జగన్ పనితీరు.. ఆయన వ్యవహార శైలి వంటివి.. ఎలా ఉన్నాయో అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా తనను సపోర్టు చేసిన వారు.. తనకు మద్దతుగా అండగా నిలిచిన వారు.. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? ఒకే కేసులో అరెస్టయి.. పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పోసాని కృష్ణ మురళి విషయంలో ప్రజల్లో సింపతీ నెలకొంటోంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఆయన తన అనారోగ్యం కారణంగా.. ఇబ్బందులు పడుతున్నానంటూ.. కోర్టుల్లో చెబుతున్న కామెంట్లు వెలుగు చూస్తున్నాయి. దీనిపై అందరూ ఆలోచన చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండి పడుతున్నారు. రాజకీయాల్లో అరెస్టులు, జైళ్లు నాయకులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి కొత్తకాకపోయినా.. వారిని కాపాడుకునే అధినేత కరువవడం మాత్రం మరింత ఇబ్బందిగా మారింది. పోసాని , బోరుగడ్డ అనిల్ వంటి వారు అరెస్టు అయినప్పుడు.. తూతూ మంత్రంగా జగన్ పరామర్శించారన్న వాదన వినిపిస్తోంది. అలా కాకుండా బలమైన ఉద్యమం చేపట్టి ఉంటే.. జగన్ కు మంచి మార్కులు పడి ఉండేవి. కానీ, ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయా సామాజిక వర్గాల్లో మరింత చులకన అవుతున్నారన్న చర్చ సాగుతోంది.