జగన్ మానసికంగా రెడీ అయ్యారట.. విషయం ఏంటంటే!
సరే.. పోయినవారు పోయారు.. ఇక, జంపింగులకు ఫుల్ స్టాప్ పడిందని అనుకునే పరిస్థితి కనిపించడం లేదు.
By: Tupaki Desk | 5 Feb 2025 1:30 PM GMTఉండేవారు-పోయేవారు- అనే జాబితాను చూసుకుంటే.. వైసీపీలో ఇప్పుడున్న వారిలో పోయే వారే ఎక్కువ గా కనిపిస్తున్నారు. గత ఏడాది ఎన్నికల అనంతరం.. పార్టీ గ్రాఫ్ పడిపోయిన దరిమిలా.. వైసీపీ నుంచి కీలక నాయకులు తప్పుకొన్నారు. కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటామని.. మరికొందరు.. జగన్ విధానాలు నచ్చలేదని ఇలా అనేక కారణాలు చెప్పి తప్పుకొన్నారు. సరే.. పోయినవారు పోయారు.. ఇక, జంపింగులకు ఫుల్ స్టాప్ పడిందని అనుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే.. పోయే వారి జాబితాపై పార్టీ అధినేత జగన్ తాజాగాతన అంతర్గత పార్టీ నాయకులతో చర్చిం చారు. పార్టీలో ఉండి.. మౌనంగా ఉన్నవారు.. పార్టీపై విమర్శలు చేసేవారి జాబితాను ఆయన రెడీ చేసిన ట్టు తెలిసింది. దీనిలో ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల వరకు, రాజ్యసభ సభ్యుల దాకా.. సుమారు.. 20 మం ది వెళ్లిపోవడం ఖాయమని జగన్ స్వయంగా పేర్కొన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ ఏమీ ఆలోచన చేయొద్దని కూడా అన్నారట.
``ఇంకో 20 మంది దాకా వెళ్లిపోతారు. మనం ఏమీ బాధపడొద్దు. ఈ విషయంలో ఏం జరిగినా.. పార్టీకి వచ్చిన నష్టం లేదు. ప్రజలే అల్టిమేట్`` అని జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంటే.. ఆయన మానసికంగా రెడీ అయ్యారన్న సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల విషయంలో ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కూడా కూటమికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేల్లోనూ నాలుగు సీట్లు లేస్తాయన్న చర్చ ఆది నుంచి ఉంది. సో.. వీరి లెక్కను పక్కాగా వేసుకున్నట్టు జగన్ మాటల్లో స్పష్టం అయింది.
ఇక, రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే.. ఇప్పటికి ముగ్గురు పార్టీ మారారు. విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి.. రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఇక, మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో నత్వానీ.. ఎలానూ టచ్‌లో లేరు. మరో ఆరుగురు ఉన్నారు. వీరిలోనూ ముగ్గురు వ్యాపార వేత్తలు ఉన్నారు. దీంతో వీరిపై ఒత్తిళ్లు సహజం. ఈ నేపథ్యంలో వారు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. లోక్‌సభ్యు ల విషయానికి వస్తే.. అందరూ సేఫే అనే చర్చ ఉంది. మొత్తానికి జగన్ మానసికంగా రెడీ అయ్యారన్నది వాస్తవం.