Begin typing your search above and press return to search.

షర్మిల - జగన్... ఇంత "ప్రత్యేకమైన" దూరమా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కు పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 6:08 AM GMT
షర్మిల - జగన్... ఇంత  ప్రత్యేకమైన దూరమా?
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కు పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వాలూ ఆయన తీసుకొచ్చిన పథకాలను కంటిన్యూ చేస్తున్నాయని అని అంటే.. ఆయన ఏ స్థాయి మార్కు ఆలోచనలు చేశారనేది అర్ధమవుతుందని అంటారు.

ఈ విధంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైఎస్సార్ ముద్ర చెరపలేనిదని అంటారు. ఆ టెంపో మెయింటైన్ చేస్తూ అన్నట్లుగా ఆయన మరణానంతరం కుమారుడు జగన్, కుమార్తె షర్మిల కలిసి ఏకతాటిపై ముందుకు కదిలారు.. దీంతో.. 2019లో రికార్డ్ స్థాయి విక్టరీతో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే.. ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయని అంటారు.

పైకి కనిపిస్తున్నట్లు, చెప్పుకుంటున్నట్లు ఇద్దరి మధ్యా ఆస్తుల తగాదానే ఈ గ్యాప్ కు కారణమా.. లేక, మరేదైనా ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... రాజకీయంగా ప్రత్యర్థులుగా వేరు వేరు పార్టీలో ఉన్నప్పటికీ... "ప్రత్యేకమైన" విషయాలను కూడా పరిగణలోకి తీసుకోనంత దూరం వారి మధ్య నెలకొందనే చర్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అవును... వైఎస్సార్ బిడ్డలు ఇద్దరూ ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన సొంత పార్టీ వైఎస్సార్సీపీకి అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా షర్మిల కొనసాగుతున్నారు. ఈ సమయంలో రాజకీయంగా విభేధాలు ఉండటం, అభిప్రాయబేధాలు ఉండటాన్ని ఎవరూ ఆక్షేపించరు!

అయితే... ఇటీవల వారి అస్తుల వ్యవహారం... మూడు లేఖలు, నాలుగు పోస్టులు, ఐదు ప్రెస్ మీట్లు అన్నట్లుగా మారిన పరిస్థితి. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. వైఎస్సార్ లాంటి వ్యక్తి కుటుంబంలో ఇలాంటి పరిస్థితా అనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆ దూరం చాలా దూరం వెళ్లిపోయిందని అంటున్నారు.

అందుకు బలమైన కారణం... పుట్టిన రోజుల నాడు కూడా ఒకరికొకరు కనీసం ఆన్ లైన్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని పరిస్థితికి చేరుకోవడాన్ని ప్రస్థావిస్తున్నారు. నిన్న (డిసెంబర్ 21) న జగన్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆయన బర్త్ డే సంబరాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా జగన్ కు ఎంతో బలమైన, ఉప్ప్పు-నిప్పు గా ఉండే రాజకీయ ప్రత్యర్థులు సైతం జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు కానీ... షర్మిల నుంచి రాలేదు! రెగ్యులర్ గా ఎక్స్ లో యాక్టివ్ గా ఉండే షర్మిల.. అక్కడ కూడా అన్నకు శుభాకాంక్షలు చెప్పలేదు. అంతక ముందు డిసెంబర్ 17న షర్మిల బర్త్ డే నీ జగన్ విస్మరించిన పరిస్థితి!

దీంతో... మిగిలిన సందర్భాల సంగతి కాసేపు పక్కనపెడితే... అన్నాచెల్లెల్లు మధ్య ఒకే నెలలో నాలుగు రోజుల తేడాలో జరిగే పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా కనీసం శుభాకాంక్షలు చెప్పుకోనంత దురం పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. మరి కాలం వీరిని కలుపుతుందా.. లేక, పరిస్థితులు ఇలానే ఉంటాయా అనేది వేచి చూడాలి!