Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు మేలు చేస్తున్న జ‌న‌సేన నిర్ణ‌యం.. !

ఈ క్ర‌మంలోనే నంద్యాల ఎమ్మెల్యే ఫ‌రూక్‌కు మంత్రి వ‌ర్గంలో కూడా చోటు క‌ల్పించారు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 3:53 AM GMT
జ‌గ‌న్‌కు మేలు చేస్తున్న జ‌న‌సేన నిర్ణ‌యం.. !
X

కూట‌మి ప్ర‌భుత్వంలో మారుతున్న ప‌రిస్థితులు.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును గ‌మ‌నిస్తే.. మైనారి టీ వ‌ర్గం ఓట్లు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్న చ‌ర్చ‌సాగుతోంది. గ‌త 2014-19 మ‌ధ్య టీడీపీకి ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కూడా లేరు. కానీ.. ఈ ద‌ఫా మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే నంద్యాల ఎమ్మెల్యే ఫ‌రూక్‌కు మంత్రి వ‌ర్గంలో కూడా చోటు క‌ల్పించారు. ఇక‌, వైసీపీ కిఅనుకూలంగా ఉన్న మైనారిటీలు కూడా కొంద‌రు.. ఈ ద‌ఫా కూట‌మి వైపు మొగ్గు చూపారు.

గుంటూరు వెస్ట్‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన మైనారిటీ ఓటు బ్యాంకు ఈ ద‌ఫా టీడీపీకి పడింది. దీంతో మైనారిటీ ఓట్ల‌ను ఆక‌ర్షించ‌డంలో టీడీపీ కీల‌కంగా ఉంది. ఇక‌, సంస్థాగ‌తంగా బీజేపీకి ఏపీలో మైనారి టీలు దూరంగా ఉన్నారు. జ‌న‌సేన వైపు కొన్నాళ్లు మొగ్గు చూపారు. అయితే.. ఇక‌, ఇప్పుడు మారుతున్న ప‌రిణామాల‌తో మైనారిటీ వ‌ర్గం పూర్తిగా జ‌న‌సేన‌కు దూర‌మ‌వుతోంది. తాను స‌నాత‌న ధ‌ర్మానికి ప్ర‌తీక‌న‌ని చెప్పుకొంటున్న ప‌వ‌న్ వైపు మైనారిటీ వ‌ర్గాలు చూడ‌డం త‌గ్గించాయి.

పైగా ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌హాకుంభ‌మేళాలో శాస్త్రోక్తంగా చేసిన స్నానం.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌రింత గ‌ట్టిగా స‌నాత‌న ధ‌ర్మాన్ని నొక్కి చెప్ప‌డం వంటివి మైనారిటీల‌కు న‌చ్చ‌డం లేదు. దీంతోనే మైనారిటీ వ‌ర్గాలు కూట‌మిలోని టీడీపీకే జైకొట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. వైసీపీని వ్య తిరేకించే మైనారిటీ వ‌ర్గాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌, టీడీపీలంటూ.. తిరిగినా.. ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు, ఆయ‌న తీసుకున్న లైన్ కార‌ణంగా.. మైనారిటీ వ‌ర్గాలు పూర్తిగా జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యార‌న్న ది వాస్త‌వం.

అయితే.. టీడీపీని ఏమేర‌కు విశ్వ‌సించార‌న్న దానిపైనే మైనారిటీ ఓటు బ్యాంకు అటు వైపు మ‌ళ్లుతుంది. బీజేపీతో చేతులు క‌లిపిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీకి మైనారిటీలు అండ‌గా నిలిచారు. కానీ.. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు నిలుస్తుందా? అనేది సందేహమే. సో.. ఇది అంతిమంగా.. జ‌గ‌న్‌కు మేలు చేస్తుంద‌న్న‌చ‌ర్చ సాగుతోంది. కూట‌మిలో టీడీపీని విశ్వ‌సించ‌క‌పోతే.. మైనారిటీల‌కు ఇక‌, కూట‌మిలో ప్ర‌త్యామ్నాయం లేదు. సో.. అప్పుడు వైసీపీ వైపే పూర్తిగా మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.