Begin typing your search above and press return to search.

జూనియర్ ట్రంప్ దేశం విడిచిపోనక్కర లేదు... నెటిజన్ల కామెంట్స్!

వీటితో పాటు మరో ఐదు స్వింగ్ స్టేట్స్ లోనూ దూసుకుపోతున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 7:23 AM GMT
జూనియర్  ట్రంప్  దేశం  విడిచిపోనక్కర లేదు... నెటిజన్ల కామెంట్స్!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యారు. అధికారం చేజిక్కించుకోవడంలో కీలక భూమిక పోషించే స్వింగ్ స్టేట్స్ లోని జార్జియా, నార్త్ కరోలియా రాష్ట్రాలను ఆయన సొంతం చేసుకున్నారు. వీటితో పాటు మరో ఐదు స్వింగ్ స్టేట్స్ లోనూ దూసుకుపోతున్నారు.

మరోపక్క డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా గట్టిగానే పోటీనిస్తున్నారు. ఇందులో భాగంగా... 12:30 పీఎం (ఐ.ఎస్.టీ) సమయానికి 51.2 శాతం ఓట్లతో 247 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇదే సమయంలో... డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 47.4 శాతం ఓట్లతో 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఈ సమయంలో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఈ సమయంలో ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఓ లైవ్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఎన్నికల ఫలితాల అనంతరం తన ప్రాణాళిక ఎలా ఉంటుందో వెల్లడించారు.

ఇందులో భాగంగా.. ఈ ఎన్నికల్లో తన తండ్రి డోనాల్డ్ ట్రంప్ గెలవకపోతే డెమోక్రాట్ల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. తాను వేరే దేశానికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు జూనియర్ ట్రంప్.

మరోవైపు... అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్ పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మరో వైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది. దీంతో... జూనియర్ ట్రంప్ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదేమో అనే కామెంట్లూ మొదలైపోయాయి!