Begin typing your search above and press return to search.

టీడీపీలోకి కేశినేని నాని ఫ్యామిలీ ?

ఇక చంద్రబాబు లోకేష్ మీద ఆయన చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా అప్పట్లో పొలిటికల్ గా వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2024 11:30 PM GMT
టీడీపీలోకి కేశినేని నాని ఫ్యామిలీ ?
X

కేశినేని నాని. ఫైర్ బ్రాండ్ ఎంపీగా గత అయిదేళ్ల కాలంలో ఉంటూ వచ్చారు. ఏకంగా టీడీపీ అధినాయకత్వాన్ని ఆయన ధిక్కరించి తన సొంత ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేశారు. అది ఎంత దాకా వెళ్ళింది అంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు బొకేను కూడా ఇచ్చేందుకు నాని నిరాకరించేటంతగా అని చెప్పుకున్నారు. ఇక చంద్రబాబు లోకేష్ మీద ఆయన చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా అప్పట్లో పొలిటికల్ గా వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి.

ఇదంతా ఎందుకు చేశారూ అంటే తన తమ్ముడు చిన్నిని పార్టీ ప్రోత్సహిస్తోందని తనను సైడ్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన చెందారు అని అంటున్నారు. అయితే పార్టీకి ఆ రకమైన ఆలోచనలు లేవని చిన్నిని తెచ్చినా నానికి కూడా తగిన స్థానం చూపిస్తారు అని అప్పట్లో అంతా చెప్పేవారు. టీడీపీ అధినాయకత్వానికి కేశినేని నాని మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆయన కుమార్తె కేశినేని శ్వేతను కార్పోరేటర్ గా చేసి మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటిస్తారు అని కూడా ప్రశ్నించిన వారూ ఉన్నారు

అయితే ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచినా అధినాయకత్వం తగిన చర్యలు తీసుకోలేదని కూడా నాని అలిగి పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించారు అని కూడా అంటారు. ఇక కారణాలు ఏమైనా కూడా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. వైసీపీ కూడా ఆయనను సమాదరించింది.

అలా కేశినేని నాని వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో పటీ చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రభంజనంలో వైసీపీ ఓటమి పాలు అయింది. తమ్ముడు చేతిలో నాని పరాజయం చెందాక ఇక రాజకీయాలకు స్వస్తి అంటూ రెండవ రోజునే ప్రకటించేశారు. ఇపుడు ఆరు నెలలు గడచాయి. కొత్తగా విజయవాడలో జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత టీడీపీలో చేరుతున్నారు అని.

ఆమె రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందని, ఎంతో భవిష్యత్తు ఆమెకు ఉన్న రీత్యా టీడీపీ జెండానే ఆమె తిరిగి పట్టుకుంటారు అని అంటున్నారు. ఈ మేరకు అయితే ప్రయత్నాలు తెర వెనక జరుగుతున్నాయని అంటున్నారు. కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కానీ తన వారసురాలి ఆలోచనలకు అడ్డు చెప్పబోరని అంటున్నారు. ఆయన రెండు సార్లు ఎంపీగా చేశారు. ఇక రాజకీయం చాలు అనుకున్నారు.

కానీ శ్వేత విషయం చూస్తే ఆమెకు ఎంతో పొలిటికల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆమె టీడీపీలోకి వెళ్తాను అంటే అభ్యంతరం నాని వైపు నుంచి చెప్పకపోవచ్చు అని అంటున్నారు. మరో వైపు టీడీపీ అధినాయకత్వం కూడా శ్వేత తిరిగి పార్టీలో చేరుతాను అంటే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది అని అంటున్నారు.

నిజానికి కేశినేని నాని పార్టీలో ఉంటే ఆయన తమ్ముడు చిన్నికి పార్లమెంట్ సీటు ఇచ్చినా నానికి కూడా అన్యాయం చేయకుండా శ్వేతను గన్నవరం ఎమ్మెల్యేగా ప్రకటించేవారని ఆమె ఈ రోజు ఎమ్మెల్యే అయ్యేదని అంటున్నారు. నాని ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఆమె ఫ్యూచర్ కూడా దెబ్బ తిందని అంటున్నారు.

ఇపుడు అన్నీ ఆలోచించుకున్న మీదటనే శ్వేత టీడీపీ వైపు వస్తున్నారు అని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానాలుగానే సాగుతోంది. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి శ్వేత టీడీపీలో చేరవచ్చు అన్న మాట అయితే ఉంది. అదే కనుక జరిగితే కేశినేని ఫ్యామిలీ మొత్తం తిరిగి సైకిలెక్కేసినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.