మళ్లీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు!... పోలీసుల అనుమానం ఏమిటంటే..?
ఈ క్రమంలో ఇటీవల మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Dec 2024 4:59 AM GMTగత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఊహించనన్ని ట్విస్టులు నెలకొంటున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రచారంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇందులో భాగంగా... తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని.. తాను తన ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరిగింది! ఈ సమయంలో తాజాగా మరోసారి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే విషయం తెరపైకి వచ్చింది. దీనిపై పోలీసులకు కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు.
అవును... మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. జర్నలిస్టుపై దాడి వ్యవహారంలో తనపై హత్యాయత్నం కేసు నమోదవ్వగా.. అందులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అంటున్నారు. దీంతో.. మోహన్ బాబును పోలీసులు ఏక్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని అంటున్నారు. వాస్తవానికి డిసెంబర్ 16న మోహన్ బాబు హైదరబాద్ నుంచి చంద్రగిరికి చేరుకున్నారు. అనంతరం డిసెంబర్ 18 సాయంత్రం తన విద్యాసంస్థల నుంచి ఆయన ప్రయాణమై వెళ్లారని.. ఎక్కడికి వెళ్లారో తెలియడంలేదని.. నాటి నుంచి ఆయన ఆచూకీ దొరకడం లేదని అంటున్నారు.
అయితే... మోహన్ బాబు ఎక్కడికి వెళ్లారు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారా.. ఇక్కడ లేకపోయినా స్వదేశంలోనే ఉన్నారా.. లేక, మరెక్కడికైనా వెళ్లారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... మోహన్ బాబు బెంగళూరు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందిస్తారా.. లేక, ప్రచారాన్ని బలపరుస్తారా అనేది వేచి చూడాలి!
కాగా... జల్ పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోపక్క ఇటీవల ఆస్పత్రిలో ఉన్న బాధితుడిని కలిసి క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అందుకు హైకోర్టు నిరాకరించింది!
ఇందులో భాగంగా... మధ్యంతర ఉత్తర్వ్యులు ఇవ్వలేమని.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది! అనంతరం ఈ నెల 23 (సోమవారం)కి వాయిదా వేసింది. దీంతో.. మోహన్ బాబు అరెస్ట్ పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారా అనే చర్చ మొదలైంది.