Begin typing your search above and press return to search.

'మోహన్ బాబు – మనోజ్'... మంచు ఫ్యామిలీలోని మంటల్లో నిజమెంత?

ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం దాడులు చేసుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 7:55 AM GMT
మోహన్  బాబు – మనోజ్...  మంచు ఫ్యామిలీలోని మంటల్లో నిజమెంత?
X

గతంలో ఓసారి మంచు విష్ణు - మంచు మనోజ్ ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. అదేమీ లేదని, ఓ షో కోసమే ఇదంతా చేశామని మనోజ్ చెప్పుకొచ్చారు! ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం దాడులు చేసుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

అవును... మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ లు ఒకరినొకరు దాడులు చేసుకున్నారని.. ఈ సమయంలో మోహన్ బాబు టీమ్ మనోజ్ పై గట్టిగానే దాడి చేసిందని.. వారిద్దరూ '100'కు డయల్ చేశారని.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని.. మనోజ్ గాయాలతో స్టేషన్ కి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారని కథనాలొస్తున్నాయి!

దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ సంచలన కథనాలు ప్రసారం అవ్వడం మొదలైంది. అయితే... ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. ఇదంతా అసత్య ప్రచారమని.. ఆస్తి వ్యవహారంలో మంచు మోహన్ బాబు – మనోజ్ లు గొడవపడ్డారనేది.. ఫిర్యాదులు చేసుకున్నారనేది అవాస్తవమని పీఆర్ టీమ్ ఖండించింది.

ఈ నేపథ్యంలో గొడవ జరిగిన మాట వాస్తవం అని కొంతమంది... అసత్య ప్రచారం అని ఇంకొంతమంది... మనోజ్ స్టేషన్ కి వెళ్లి ఉంటే మీడియాకు కనిపించేవారని మరికొంతమంది ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. మరోపక్క.. నిప్పులు లేనిదే పొగ రాదని.. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరొకరు మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇస్తే తప్ప క్లారిటీ రాదని అంటున్నారు.