"ఇంట్లోనే ఉన్నాను"... మీడియాకు మోహన్ బాబు రిక్వస్ట్!
ఈ సమయంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
By: Tupaki Desk | 14 Dec 2024 8:18 AM GMTమంచు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకు చేరిన నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! అనంతరం ఆయన డిశ్చర్ అయ్యారు. మరోపక్క మంగళవారం రాత్రి జల్ పల్లిలోని ఆయన నివాసంలో మీడియాపై జరిగిన దాడిలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ సమయంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. ఆ హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోర్టు విచారణను వాయిదా వేసిందని అంటున్నారు. మరోపక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసిందనేలా పలు మీడియాల్లో కథనాలు హల్ చల్ చేశాయి. దీంతో.. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చర్చలు మొదలయ్యాయి.
దీంతో... మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లారని రకరకాల ప్రచారాలు హల్ చల్ చేశాయి! మరోపక్క అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదు.. కోర్టు వాయిదా మాత్రమే వేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు స్పందించారు.
అవును... మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నరంటూ జరుగుతున్న కథనాలపై మోహన్ బాబు స్పందించారు. ఇందులో భాగంగా... తన ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదని.. తాను ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.
"తప్పుడు ప్రచారం చేస్తున్నారు! ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు.. నేను మా ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నాను.. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని మీడియాను కోరుతున్నాను!" అంటూ మోహన్ బాబు ఎక్స్ వేదికగా శనివారం ఓ పోస్ట్ పెట్టారు. దీంతో.. మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారంపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
కాగా.. మంగళవారం రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో.. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు.
అయితే.. ఆ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. అయితే... ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసిందని.. దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మోహన్ బాబు.. తన బెయిల్ పిటిషన్ తిరస్కరించబడలేదని.. తాను ఇంట్లోనే ఉన్నానని తాజాగా వెల్లడించారు.