పవన్ అజ్ఞాతంలో... ఎందుకలా ?
ఆ తరువాత నుంచి ఆయన వాయిస్ అలాగే ఆయన గురించిన వార్తలు పెద్దగా రావడం లేదు.
By: Tupaki Desk | 1 Feb 2025 4:13 AM GMTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సందడి చేయడం లేదు అన్న చర్చ వస్తోంది. ఆయన రిపబ్లిక్ డే రోజున కనిపించారు. ఆ తరువాత నుంచి ఆయన వాయిస్ అలాగే ఆయన గురించిన వార్తలు పెద్దగా రావడం లేదు. ఎందువల్ల అన్నది ఇపుడు చర్చ సాగుతోంది.
పవన్ అజ్ఞాతంలో ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అన్నది కూడా మరో చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ ఒక వైపు పాలనా వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నారు. దాంతో ఆయన సైలెంట్ గా తన సినిమాల వర్క్ కానిచ్చేస్తున్నారా అన్నది కూడా డిస్కషన్ సాగుతోంది.
అయితే అది కూడా కాదనే మళ్ళీ అంటున్నారు. మరి పవన్ ఎక్కడ ఉన్నారు అంటే ఆయన చాలా కాం గా విదేశీ పర్యటన పెట్టుకున్నారు అక్కడికే ప్రస్తుతం వెళ్ళారు అని వార్తలు వినవస్తున్నాయి. ఆయన తన భార్యతో పాటు పిల్లలను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళారు అని ప్రచారం అయితే సాగుతోంది. అక్కడ కొద్ది రోజులు ఉన్న అనంతరం పవన్ నేరుగా ఢిల్లీకి చేరుకుంటారని అంటున్నారు. ఆయన బహుశా ఫిబ్రవరి 2 నాటికి ఢిల్లీలో బీజేపీ తరఫున శాసనసభ ఎన్నికల ఫ్రచారంలో పాలు పంచుకుంటారు అని అంటున్నారు.
పవన్ ని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోమని ఆహ్వానించింది. ఆయన గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. అక్కడ బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు దక్కాయి. దాంతో పవన్ మార్క్ పాలిటిక్స్ తో హిట్ కొట్టామని బీజేపీ పెద్దలు భావించారు. ఆ సెంటిమెంట్ ని పట్టుకుని ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆయన చేత ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు.
అయితే పవన్ ఎపుడు ప్రచారం చేస్తారు అన్నది ఇంకా ఖరారు అయితే కాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపెయిన్ షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయలేదు. మరో వైపు చూస్తే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి మూడో తేదీతో ముగుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఫిబ్రవరి 1 2 తేదీలలో ప్రచారం చేస్తారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ మాత్రం కొద్ది రోజులుగా ఇలా అజ్ఞాతంలో ఉండడం వెనక విదేశీయానమే కారణం అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉన్నది అయితే తెలియదు కానీ పవన్ సమీక్షలు అవీ లేకపోవడంతో ఆయన తెర వెనకనే ఉన్నారన్నది వాస్తవం అంటున్నారు.