పొలిటికల్ స్టార్ ఆఫ్ 2024 : వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ !
మరి చరిత్రలో కలవబోతున్న 2024లో వివిధ రంగాలలో చరిత్ర సృష్టించిన వారిని తలచుకోవడం అనివార్యం, అవసరం కూడా.
By: Tupaki Desk | 8 Dec 2024 3:31 AM GMTమరి కొద్ది రోజులలో 2024 కేలండర్ నుంచి పక్కను పోతుంది. అది ఒక చరిత్రగా మారుతుంది. ఇక 2025 కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఇరవై రోజులలో కొత్త ఆంగ్ల సంవత్సరం రాబోతోంది. మరి చరిత్రలో కలవబోతున్న 2024లో వివిధ రంగాలలో చరిత్ర సృష్టించిన వారిని తలచుకోవడం అనివార్యం, అవసరం కూడా.
రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే రాజకీయంగా ఈ ఏడాది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అంటే కచ్చితంగా చెప్పే పేరు ఒకే ఒకటి. అదే జనసేనాని పవన్ కల్యాణ్ అని. పవన్ కళ్యాణ్ దే 2024 అని ఫుల్ క్లారిటీగా చెప్పాల్సిందే.
పవన్ కళ్యాణ్ పేరు ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు జాతీయ స్థాయిలో మారు మోగింది. ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా టీడీపీ బీజేపీ లను కలిపి కూటమి కట్టించారు. అది ఆయన 2022లో ఇప్పటంలో జగిన జనసేన వార్షిక సదస్సులో చెప్పిన మాట మేరకు ఆచరణలో చేసి చూపించారు.
ఆనాడు ఆయన ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేస్తామని గర్జించారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తామని శపధం పట్టారు. అపుడు అంతా దానికి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆనాడు జనసేన టీడీపీ కూడా మిత్రులు కారు. ఇక బీజేపీతో కటీఫ్ ఇచ్చి టీడీపీ నాడు సెపరేట్ గా ఉంది. ఇలాంటి రాజకీయాల నడుమ ఎంతో దూర దృష్టితో ఆలోచించి పవన్ ఇచ్చిన నాటి స్టేట్మెంట్ చివరికి నిజం అయింది.
అంటే దాని వెనక పవన్ మార్క్ వ్యూహాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. తపన ఉంది, ఆరాటం ఉంది, పోరాటం ఉంది. ఆయనే చెప్పుకున్నట్లుగా ఈ పొత్తుల కోసం ఎన్నో చేయాల్సి వచ్చింది. తానుగా ఎంతో తగ్గించుకోవాల్సి వచ్చింది. 24 సీట్లు మూడు ఎంపీ సీట్లను పొత్తులో మొదట తీసుకున్న జనసేన ఆ తరువాత ఎంపీ నుంచి ఒక సీటు ఎమ్మెల్యే నుంచి మూడు సీట్లు తగ్గించుకుంది అంటే పొత్తుల పట్ల కూటమి పట్ల పవన్ కి ఉన్న నిబద్ధత ఎంతో చాటి చెప్పింది.
అలా తీసుకున్న 21 సీట్లకు గానూ మొత్తం సీట్లను గెలిచి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో పవన్ తన సత్తా చాటారు. వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అన్న ఆయన చాణక్య శపధం నెరవేర్చుకుని మరీ రాజకీయ ధీరుడిగా తెలుగు నాట నిలిచారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలను మలుపు తిప్పి అసలైన పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. పవన్ బాబు ఇద్దరూ కృష్ణార్జునులు మాదిరిగా ఏపీలో రాజకీయ కురుక్షేత్రంలో నిలబడి అలుపెరగని యుద్ధం చేశారు అద్భుతమైన విజయం అందుకున్నారు. అలా పవన్ కే ఎక్కువ క్రెడిట్ ఇందులో ఉంది అని చెప్పాల్సి ఉంది.
మరో వైపు చూస్తే ఏపీలో గెలిచిన అత్యధిక ఎంపీ సీట్లే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఆధికారంలోకి రావడానికి కారణం అయ్యాయి అంటే పవన్ పట్టుదల వ్యూహాలు జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ఎంతగా ఊపిరి పోశాయో ఊహించాల్సిందే అంటున్నారు. అందుకే పవన్ ని తుఫాను అని ప్రధాని స్థాయి వ్యక్తి నరేంద్ర మోడీ కితాబు ఇచ్చారు.
అంతే కాదు పవన్ ని మోడీ సహా బీజేపీ పెద్దలు ఎంతగానో అభిమానిస్తూ ఆయనను ఒక పొలిటికల్ స్టార్ గా చూడడం ఆరంభించారు. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ చేసిన ప్రచారంతో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి 232 సీట్లు దక్కాయి అంటే పవన్ చరిష్మా ఎల్లలు దాటి బిగ్ సౌండ్ ఎంతలా చేసిందో అందరికీ అర్థం అయింది అని అంటున్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ రికార్డులు సృష్టిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామసభలు నిర్వహించి గిన్నీస్ రికార్డుని ఆయన అందుకున్నారు అంతే కాదు గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ గ్రామ స్వరాజ్యానికి కొత్త అర్ధం చెబుతున్నారు. ఏపీలో అనేక సమస్యల సాధనకు తనదైన శైలిలో పరిష్కారం అందిస్తూ పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇలా ఏ విధంగా చూసినా పవన్ రాజకీయ వెలుగులు ఈ ఏడాది అంతటా పెద్ద ఎత్తున ప్రసరిస్తున్నాయి. ఈ వెలుగు జిలుగులతో పవన్ కళ్యాణ్ 2024 నుంచి 2025లోకి అడుగు పెడుతున్నారు. వచ్చే ఏడాదిలో కూడా జనసేన అధినేత అద్భుతాలు సృష్టించాలని అంతా కోరుకుంటున్నారు. సో పవన్ పొలిటికల్ హీరోయిజం స్టారిజం మరిన్ని కేలండర్లను కూడా చూస్తుందన్న మాట. ఎనీ డౌట్స్.