Begin typing your search above and press return to search.

'వారానికి 90 గంటలు పని'... తప్పుగా అర్ధం చేసుకున్నారంట!

వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే విషయంలో గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2025 6:30 AM GMT
వారానికి 90 గంటలు పని...  తప్పుగా అర్ధం చేసుకున్నారంట!
X

వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే విషయంలో గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వారానికి అత్యధిక గంటలు పని చేయాలని ఒకరంటే.. రోజుకి 8 గంటలు మించి పని చేయడం వల్ల ఒత్తిడి పెరిగి.. అది మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుందని.. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ పోతున్నాయని మరికొంతమంది అంటున్నారు.

ఈ సమయంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి! ఇందులో భాగంగా.. వారానికి 90 గంటలు పని చేయాలని ఆయన చెప్పారనే విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ హెచ్.ఆర్. హెడ్ మురళీధరన్ స్పందించారు. సుబ్రహ్మణ్యన్ మాటలను తప్పుగా అర్ధం చెసుకున్నారని తెలిపారు.

అవును... వారానికి 90 గంటల పనిపై ఎల్ & టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. అది తనను ఎంతో నిరుత్సాహాన్ని కలిగించిందని మురళీధరన్ పేర్కొన్నారు. ఆయన భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్లే అనవసరమైన విమర్శలు వ్యాపారవేత్తలతో పాటు పలు వర్గాల నుంచి తెరపైకి వచ్చాయని అన్నారు.

ఈ సందర్భంగా.. తమ అంతర్గత చర్చల్లో కూడా వారానికి 90 గంటలు పని చేయాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదని.. ఈ మేరకు కనీసం అలాంటి సలహా కూడా ఇవ్వలేదని.. ఆయన మామూలుగా చేసిన వ్యాఖ్యలు చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారని.. దీంతో ఆయన నిజమైన భవాన్ని ప్రతిబింబించని వివాదానికి అది ఆజ్యం పోసిందని తెలిపారు.

ఇదే సమయంలో... సంస్థలోని ప్రతీ ఉద్యోగినీ తన కుటుంబంలోకి వ్యక్తిగానే సుబ్రహ్మణ్యన్ పరిగణిస్తారని.. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఇది చాలా అరుదైన విషయమని వివరించారు.

మల్లిఖార్జున ఖర్గే సీరియస్!:

తాజాగా ఈ విషయంపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్ & టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన ప్రతిపాదనతో తాను ఏకీభవించలేనని అననరు. భారత పరిశ్రమల చట్టాన్ని రూపొందించే సమయంలో.. కార్మికుల చేత రోజుకు 8 గంటలకు మించి పనిచేయించరదని తొలి ప్రధాని నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ భావించారని అన్నారు.