బీఆర్ ఎస్ నాయకుల అరెస్టు.. ఏం జరిగింది?
సభకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 3:52 PM ISTతెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి సహా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లకు తరలించా రు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సభకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించి లోని కి పంపిస్తున్నారు.
ఏం జరిగింది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిరసనలపై కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధిస్తూ.. జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ప్రఖ్యాల ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు, ధర్నాలపై నిషేధం విధిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. పోరాటాలకు, తెలంగాణ ఉద్యమానికి పురుటి గడ్డ అయిన ఉస్మాని యా యూనివర్సిటీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆరోపిస్తూ.. బీఆర్ ఎస్ నాయకు లు నిరసనలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీకి ముట్టడి చేపట్టారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశా ల సందర్భంగా శాసన సభను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు, బీఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అసెంబ్లీ చుట్టపక్కల అప్రమత్తయ్యారు. నిరసనకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ ఎస్ నేతలను అరెస్టు చేశారు. పలు పోలీసు స్టేషన్లకు వారిని తరలించారు.