Begin typing your search above and press return to search.

మహా విజయం.. బాబు జగన్ సేఫ్ !

మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ఏపీ మీద కూడా పెను ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2024 4:31 AM GMT
మహా విజయం.. బాబు  జగన్ సేఫ్ !
X

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని మహాయుతి కూటమి గెలవడంతో ఏపీలో రాజకీయ పరిణామాల మీద ఏ మేరకు ప్రభావం ఉంటుంది అన్నది కూడా చర్చకు వస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ఏపీ మీద కూడా పెను ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీలో ఎన్డీయే కూటమి రాజ్యమేలుతోంది. అందులో టీడీపీ పెద్దన్నగా ఉంటే జనసేన బీజేపీ మిత్రులుగా ఉన్నాయి. ఇపుడు బీజేపీ మిత్రుడి గెలుపు అంటే ఎన్డీయే బలోపేతం కావడం అంటే అది కచ్చితంగా బాబుకు పవన్ కి కూడా కొండంత బలం అని అంటున్నారు.

మరింతకాలం ఏపీలో ఈ కూటమికి తిరుగులేదు అన్న భావనను ఈ విజయం అందించింది అని అంటున్నారు. దేశంలో మోడీ ఇమేజ్ బాగా వెలుగుతోంది అన్న సంకేతాలను ఈ విజయం ఇచ్చింది. మరి మోడీ దేశానికి ప్రధాని, ఆయన జాతీయ రాజకీయాలను మొత్తం ప్రభావితం చేస్తారు.

అందువల్ల మోడీకి జనం ఎక్కడ జేజేలు కొట్టినా ఆ ప్రభావం దేశమంతా ఉంటుంది. ఆ విధంగా ఏపీలోనూ ఉంటుంది. దాంతో ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కి మహా విజయం అతి పెద్ద భరోసాగా మారబోతోంది. ఈ ముగ్గురు మిత్రుల బండి ఏపీలో ఇంకా స్పీడ్ గా నడుస్తుంది అని అంటున్నారు.

మిత్రులు కాబట్టి టీడీపీకి, జనసేనకు మహా విజయం వల్ల రాజకీయ లాభం అనుకోవచ్చు. జగన్ కి ఏమిటి లాభం అన్నది కూడా అంతా ఆలోచించే విషయమే కదా. అయితే జగన్ కి లాభం ఎంటి అంటే దేశంలో కాంగ్రెస్ బలపడకపోవడం అని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ ఏ మాత్రం బలపడినా అది ఏపీలో కూడా పుంజుకుంటుంది.

అపుడు వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్ ని చీల్చి ఏర్పడింది అని అంటున్నారు. దాంతో ఏపీలో వైసీపీని పూర్తిగా ఆకట్టుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ మొదలెడుతుంది అని అంటున్నారు.

అసలే మూలిగే నక్క తీరున ఉన్న వైసీపీకి కాంగ్రెస్ బలం తో దూసుకుని వస్తే తాటిపండు నెత్తిన పడినట్లే అని అంటున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ భయం వైసీపీకి చాలానే ఉంది అని అంటున్నారు. అయితే హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఈవీఎంల వల్లనే అని కాస్తా సాఫ్ట్ కార్నర్ తో జగన్ మాట్లాడినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి తగిన రియాక్షన్ రాలేదు.

ఎందుకు అంటే ఏపీలో జగన్ పార్టీ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం వైఖరి 2011 మాదిరిగానే ఉంది అని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ గెలిచి ఉంటే ఎపీలో షర్మిల తో దూకుడు చేయించి మరీ జగన్ ని ఇంకా గట్టిగా టార్గెట్ చేసి ఉండేవారు అని అంటున్నారు.

కానీ ఇపుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది అని అంటున్నారు. కాంగ్రెస్ తన వరకే అస్తిత్వ పోరాటంలో ఉందని కూడా అంటున్నారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ బలహీనంగా ఉండడం వైసీపీకి శ్రీరామ రక్ష గానే ఉంటుందని అంటున్నారు.

అంతే కాదు కాంగ్రెస్ అలా వీక్ గా ఉంటేనే వైసీపీ వంటి పార్టీలను ముందు ముందు కలుపుకుని పోయేందుకు చూస్తాయని అపుడు ఏపీలో కూడా వైసీపీ అండ అవసరం కూడా హస్తం పార్టీకి పూర్తిగా పడుతుందని అంటున్నారు.

ఇలా కనుక లోతైన పరిశీలన చేస్తే మహారాష్ట్ర ఫలితాలు అధికారంలో ఉన్న టీడీపీకి జనసేనకే కాదు విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా భారీ ఊరటను ఇచ్చేలా ఉన్నాయనే అంటున్నారు. సో ఇప్పటికి అయితే ఇదీ పరిస్థితి. రానున్న రోజులలో రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాఓ ఎవరో చెప్పలేని పరిస్థితి అనే అంటున్నారు.