Begin typing your search above and press return to search.

సీబీఐ డైరెక్ట్ ఎంట్రీ ఆయన కోసమేనా ?

సీబీఐని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేలా అనుమతిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:43 PM GMT
సీబీఐ డైరెక్ట్  ఎంట్రీ ఆయన కోసమేనా ?
X

ఏపీలో సంచలన పరిణామాలు తొందర్లో చోటు చేసుకోబోతున్నాయా అంటే అదే నిజం అన్నట్లుగా పరిణామాలు కనీస్తున్నాయి. సీబీఐని ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేలా అనుమతిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంతో రాజమార్గాన సీబీఐ ఏపీలో అడుగుపెట్టనుంది.

లేకపోతే కోర్టుల ఆదేశంతోనే సీబీఐ ఏపీలోకి రావాల్సి ఉండేది. మరి ఈ నిర్ణయం ఇపుడే ఎందుకు తీసుకున్నారు అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీలో సీబీఐ డైరెక్ట్ ఎంట్రీ అన్నది ఎవరి కోసం అంటే దాని మీదనే హాట్ హాట్ గా పొలిటికల్ డిస్కషన్ సాగుతోంది.

సీబీఐ పవర్ ఫుల్ దర్యాప్తు సంస్థ. ఏపీలో చాలా కేసులను సీఐడీకి అప్పగించి దర్యాప్తు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. అలాగే ఏసీబీ కూడా కొన్ని కేసులు చూస్తోంది. అయితే పొలిటికల్ గా హై ప్రొఫైల్ కేసులు బిగ్ షాట్స్ కి సంబంధించిన కేసులు సీబీఐకి అప్పగిస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏసీబీ, సీఐడీల ద్వారా బిగ్ షాట్స్ కేసులు విచారణకు అప్పగించినా ఏదో నాటికి బెయిల్ వస్తుంది కానీ సీబీఐ నమోదు చేసి దర్యాప్తు చేసిన కేసులు అయితే ఒక పట్టాన బెయిల్ రాదు అని అంటున్నారు. ఆ కేసుల తీవ్రత దృష్ట్యా కూడా దేశంలోని అత్యున్నత సంస్థకు అప్పగించాలని కూడా ఆలోచిస్తున్నారుట.

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కి సంబంధించిన కేసులను సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అందుకే సీబీఐ డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి ఇచ్చారు అని టాక్ నడుస్తోంది. ఆ విధంగా జగన్ చుట్టూ ఉచ్చు బిగించేందుకే ఇదంతా అని అంటున్నారు. సీబీఐకి అనుమతి ఇవ్వడం అన్నది జగన్ తో పాటు వైసీపీలో కొందరు బిగ్ షాట్స్ కోసమే అని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా శాఖలకు సంబంధించి గత ప్రభుత్వంలో అవినీతి అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల మీద చాలా కేసులను సీఐడీకి అప్పగించింది.

అందులో లిక్కర్ స్కాం తో పాటు ఇసుక స్కాం, ఆడుదాం ఆంధ్రా అలాగే ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే ఇపుడు సీబీఐకి ఏ కేసులు అప్పగిస్తారు అన్నదే చర్చగా ఉంది. చాలా ముఖ్యమైన కేసులనే సీబీఐకి అప్పగించి విచారణ చేయిస్తారు అని అంటున్నారు ఎటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి సీబీఐ కేసుల ఉచ్చు బిగిస్తే జగన్ అండ్ కో తప్పించుకోవడం కష్టం అన్న భావన వ్యక్తం అవుతోంది.

ఈ విధంగా ప్రత్యర్థిని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయడంతో పాటు తమ చేతికి మట్టి అంటకుండా చేసుకోవడం ద్వారా ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు అని చెప్పుకోవడానికి సీబీఐకి ఏపీలో డైరెక్ట్ ఎంట్రీకి చాన్స్ ఇచ్చారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఢిలీ సీఎం కేజ్రీవాల్ సంగతి తీసుకుంటే ఆయన మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు ఫైల్ చేయడంతో ఆయనకు బెయిల్ రాకుండా నెలల తరబడి జైలు గోడల మధ్యన ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఏపీలో కూడా తొందరలో అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఒక విధంగా చూస్తే భారీ పొలిటికల్ స్కెచ్ తోనే ఇదంతా జరుగుతోంది అని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మరో నాలుగు నెలలలో ఈ ఏడాది ముగుస్తుంది. కానీ 2025 మాత్రం వైసీపీలోని బిగ్ షాట్స్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టే ఇయర్ గా చెబుతున్నారు.

కొత్త ఏడాది సంక్రాంతి తరువాత ఏపీలో పెను రాజకీయ సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి సీబీఐ అంటేనే పటిష్టమైన దర్యాప్తు సంస్థ. కాబట్టి ఏపీలో సీబీఐ చేపట్టే కేసులు కూడా ప్రతిష్టాత్మకమైనవి ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది స్మూత్ గా ఎండ్ అయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం రాజకీయ భూకంపాలతో మొదలవుతుందని అని అంచనా అయితే వేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.