సజ్జలను జగన్ సైడ్ చేసేశారా ?
వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఈ విషయాలు అన్నీ కూడా జగన్ గ్రహించారు అని అంటున్నారు. అందుకే ఆయన సజ్జలను సైడ్ చేశారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Aug 2024 5:30 PM GMTవైసీపీ అధినాయకత్వం ఓటమికి గల కారణాలు అన్వేషిస్తూనే ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఓడాం అన్నది ఇదమిద్దంగా తెలిసిపోయింది. అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన కూడా అవసరం అన్నది పార్టీ అధినేతకు తెలిసివచ్చింది అని అంటున్నారు.
వైసీపీ అయిదేళ్ళ పాలనలో జగన్ తెర వెనక ఉంటే తెర ముందు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అందరి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారుడు ఎక్కువ అధికారం ఎంజాయ్ చేశారు అన్నది వైసీపీ వర్గాల ఆరోపణ. ఆయనే ప్రతీ దానికీ మీడియా ముందుకు వచ్చి సకల శాఖల మంత్రిగా మారిపోయారు అని కూడా విమర్శలు ఉన్నాయి.
విపక్షాలు సజ్జలను అలా కామెంట్స్ చేసినా వారు ప్రత్యర్థులు అనుకున్నా సొంత పార్టీలోనూ సజ్జల పట్ల వ్యతిరేకత అలాగే ఉంది అని అంటున్నారు. నిజానికి పార్టీ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో సజ్జల కూడా ఒకరు అని అంటున్నారు. పార్టీ కి జగన్ ప్రభుత్వానికీ జగన్ కి మధ్యన సజ్జల ఉన్నారని అలా ఒక పెద్ద గ్యాప్ రావడానికి ఆయన కారణం అని అంటున్నారు.
దీని వల్ల పార్టీ విషయాలు అధినేతకు చేరేవి కావని అలాగే ప్రభుత్వం లో కూడా అంతా బాగుంది అన్న్ ఫీల్ గుడ్ ఒపీనియన్ ని అధినేతకు సజ్జల వంటి వారు పంపించడం వల్లనే కొంప కొల్లేరు అయింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపె వారి దృష్టిలో సజ్జల విలన్ అయిపోయారు అని అంటున్నారు.
ఏ విషయం అయినా సజ్జలనే జగన్ సంప్రదించేవారని దాని వల్ల ఎవరికీ ప్రాముఖ్యత లేకుండా పోయేదని, దాని వల్ల పార్టీ వాయిస్ తో పాటు సమిష్టి నిర్ణయం కూడా లేకుండా పోయింది అని అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఈ విషయాలు అన్నీ కూడా జగన్ గ్రహించారు అని అంటున్నారు. అందుకే ఆయన సజ్జలను సైడ్ చేశారు అని అంటున్నారు.
నిజంగా సజ్జలను సైడ్ చేశారా అంటే ఆ విధంగా ప్రచారం అయితే సాగుతోంది. పార్టీ కునారిల్లడానికి నియోజకవర్గాలలో ఉన్న వర్గ పోరును సైతం అధినేతకి తెలియచేసి తగ్గించే ప్రయత్నం చేయకపోవడానికి సజ్జల కారణం అని కూడా అంటున్నారుట.
ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలోనే సజ్జల అన్న వారు మీడియా తెరకు దూరం అయ్యారని అంటున్నారు. ఇక సజ్జల ఎప్పటికపుడు ఇచ్చిన రాంగ్ ఫీడ్ బ్యాక్ వల్లనే ఈ రకమైన పరిస్థితి అని కూడా అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఆనాడు ప్రతీ నేత తో మాట్లాడడం, అలాగే ప్రతీ నియోజకవర్గానికి సంబంధించిన నివేదికలను జగన్ కి చేరవేయడంతో సజ్జల కీలక పాత్ర పోషించారు అని అంటున్నారు.
ఒకప్పుడు పార్టీలో సజ్జల అంతా తానై వ్యవహరించేవారని జగన్ కి నీడగా ఉంటూ మంత్రులను ఎమ్మెల్యేలను సైతం పెద్దగా పట్టించుకునే వారు కాదని కూడా అంటున్నారు. జగన్ ని తెర వెనక ఉంచి చాలా విషయాలు సజ్జల తానే స్వయంగా చూసారు అని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటగా ఉంది.
అలా సజ్జల ఎంతలా కీలకం అయ్యారు అంటే సజ్జలను కలిస్తే చాలు పని అయిపోయింది అని ఎక్కువ మంది వైసీపీ నేతలు భావించేలా అని అంటున్నారు. ఇక సజ్జల నామినేటెడ్ పదవుల నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకూ ప్రధాన సలహాదారుడిగా వ్యవహరించారు అని ప్రచారం జరుగుతోంది.
ఇక వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత చాలా మంది వైసీపీ నేతలు కూడా సజ్జల మీదనే విమర్శలు చేయడం జరుగుతోంది అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో జగన్ సజ్జలను దూరంగా పెట్టారు అని అంటున్నారు. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే తానే మొత్తం పార్టీ విషయాలు చూసుకోవాలని అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ సజ్జలను దూరం పెడితే మాత్రం వైసీపీలో అది అతి పెద్ద సంచలన పరిణామంగానే ఉంటుంది అని అంటున్నారు.