Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ వైసీపీలో ఉన్నట్లేనా ?

తాను మీడియా ముందుకు రాకూడదు అనుకున్నానని తన పనేంటో తానేంటో అని ఉంటే కోరి మరీ కెలుకుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 3:05 AM GMT
మాజీ ఎంపీ వైసీపీలో ఉన్నట్లేనా ?
X

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. తన మీద కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని తన వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీసేలా రాతలు రాస్తూ కధనాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు.

తన కుటుంబ సభ్యులను గత ఏడాది హేమంత్ అన్న వ్యక్తి కిడ్నాప్ చేస్తే దానికి కూడా వేరే కధలు అల్లి తనను అప్రతిష్టపాలు చేస్తున్నారు అని ఆయన వాపోయారు. తాను మీడియా ముందుకు రాకూడదు అనుకున్నానని తన పనేంటో తానేంటో అని ఉంటే కోరి మరీ కెలుకుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

చావు బతుకుల నుంచి పోరాటం చేస్తూ తన కుటుంబం ఆ కిడ్నాపర్ల బారి నుంచి ఎలా బయటకు వచ్చింది అన్నది తమకు మాత్రమే తెలుసు అని ఆయన అన్నారు. కట్టు కధలు అల్లే వారికి తమ బాధ అర్ధం కాదు అని అన్నారు. ఇదిలా ఉంటే జూన్ 4న ఫలితాలు చూసి తాను షాక్ తిన్నానని అందుకే తాను సైలెంట్ అయ్యాయన్ని ఎంవీవీ చెప్పారు. గెలిచిన వారు పాలన చేయాలని వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎంవీవీ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే మొత్తం మీడియా సమావేశంలో ఆయన తనను తాను డిపెండ్ చేసుకుంటూ కనిపించారు తప్ప పెద్దగా పార్టీ ప్రస్తావన అయితే తేలేదు. దాంతో ఎంవీవీ వైసీపీలో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. విశాఖలో చూస్తే ఒక వైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జీవీఎంసీలో జరుగుతున్నాయి. అదే విధంగా మరో వైపు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించారు. గత రెండు నెలలలో పలు మార్లు జగన్ తాడేపల్లిలో విశాఖ పార్టీ పరిస్థితుల మీద సమీక్షాలు నిర్వహించారు. అయితే ఓటమి తరువాత ఎంవీవీ వైసీపీ అధినాయకత్వాన్ని కలిసినట్లుగా అయితే ఎక్కడా లేదని అంటున్నారు.

ఇపుడు కూడా ఆయన తన వ్యక్తిగత ప్రతిష్ట అంటున్నారు తప్ప పార్టీ గురించి చెప్పడం లేదు. ఇంకో వైపు చూస్తే ఆయన కూటమి వైపుగా రావడానికి ఒక మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ద్వారా రాయబారాలు నడుపుతున్నారని కూడా ప్రచారం అయితే సాగుతూ వచ్చింది.

మొత్తం ఈ పరిణామాలు అన్నీ చూసిన మీదట ఎంవీవీ వైసీపీకి దూరం అవుతున్నట్లేనా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఎంవీవీ తన మీద అవాస్తవాలు అసత్య కధనాలు అని ఆయన మీడియా మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఆయన మాజీ ఎంపీగా పార్టీలో కీలక నేతగా ఉంటే కనుక పార్టీ ఆయనను తమ నాయకుడిగా భావిస్తే కనుక ఈపాటికే ఖండనలు పార్టీ నేతల నుంచి వచ్చి ఉండాలి. ఎంవీవీకి బాసటగా నిలిచి ఉండాలి. అలాంటిది ఏదీ ఈ వైపున జరగలేదు, ఎంవీవీ కూడా దూరం పాటిస్తున్నారు. దీంతో ఎంవీవీ మాజీ ఎంపీ ట్యాగ్ తోనే ముందుకు సాగాలని చూస్తున్నారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.