మహానగరాలకే దిక్కులేదు... జగనన్న కాలనీలపై నిందలా?
By: Tupaki Desk | 29 July 2023 10:15 AM GMTపేదలకు మంచి జరిగితే ఓర్చుకోలేని నైజం.. వారు సౌకర్యంగా బ్రతికితే తాళలేని తత్త్వం చాలా మంది పెత్తందారులకు ఉంటుంటుంది అని అంటుంటారు. చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తుంటారు. అయితే తాజాగా ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు, ఫలితంగా ఏర్పడిన జగనన్న కాలనీలు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత వారం రోజులుగా వర్షాలు ఎడతెరిపు లేకుండా కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో చుక్క నీటి జాడలేని వాగులు సైతం పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వేసవిలో బావురుమన్న బావులు సైతం తల్లికట్టును దాటి నీళ్లు బయటకు తొణికిసలాడుతున్నాయి.
ఈ భారీ వర్షాలకు చంద్రబాబు నిర్మించి ప్రపంచ పటంలో పెట్టినట్లు చెప్పుకునే హైదరాబాద్ సైతం నీళ్లపాలయిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో కార్లకు బదులు బోట్లు తిరిగాయి. ఇదే సమయంలో చాలా చోట్ల రైల్వే స్టేషన్ లు, జాతీయ రహదారులు సైతం నీళ్లలో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా ఈ భారీవర్షాల వల్ల భాగ్యనగరంలో అభాగ్యులుగా అల్లల్లాడినవారి సంఖ్య చాలా ఎక్కువనే అంటున్నారు. వరదనీటికి బయపడి మిద్దెనెక్కిన ప్రజలు.. కొట్టుకుపోయిన మూగ జీవాలు, ఆ నిటీలో తేలియాడిన వాహనాలు.. ఎన్నో ఎన్నో ఎన్నెన్నో!
అయితే ఈ విషయాలు పవన్ కల్యాణ్ కి తెలియనివి కాదు! రెండేళ్ల క్రితం అపార వర్షాలకు మద్రాస్ నగరం సైతం మునిగిపోయింది.. అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా పిలిచే బెంగళూరులో బెదిరిపోయింది. దేశ రాజధాని సైతం చిగురుటాకులా వణికిపోయింది! ఇవన్నీ కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసేవే!
అయితే తాజాగా ఈ విషయాలన్నీ మరిచో.. లేక, వాటిపై అవగాహనలేకో తెలియదు కానీ... జగనన్న కాలనీలపై పడ్డారు పవన్ కల్యాణ్! ఒకసారి కాలనీ రూపొందిన తరువాత... ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు రావడం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడటం.. ఫలితంగా వషపు నీరు నిలవకుండా వెళ్లడం వంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అలా కాకుండా... కేవలం ఖాళీగా ఉన్న లే అవుట్లలో.. లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలవడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇదే క్రమంలో... ఇంకా ఇళ్ల నిర్మాణాలు జరగని జగనన్న లే అవుట్లలో కూడా నీరు నిలిస్తే నిలిచి ఉండొచ్చు. అయితే ఆ విషయాన్ని బూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు పవన్! ఇందులో భాగంగా ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు.
దీంతో... పేదలు ఫైరవుతున్నారు. జగన్ సర్కార్ ఇచ్చిన ఇంటి స్థలాన్ని చంద్రబాబు సమాధికి సరిపోద్దని స్మశానాలతో పోల్చడం.. నేడు భారీవర్షాలకు ఖాలీస్థలాల్లొ నీరు చేరితే ఫోటోలు తీసి అల్లరి చేయడం భావ్యం కాదని.. ఇది కుసంస్కారానికి నిదర్శనం అని జనగన్న కాలనీలలో ఇళ్ల పట్టాలు పొందిన పేదలు ఫైరవుతున్నారు.
ఇదే సమయంలో... అందాల ఆగ్రాను యమునా చుట్టుముట్టలేదా? బాబు కట్టానని చెప్పుకునే భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా? గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంకగ్రామాల పరిస్థితి కానరాదా? తెలంగాణలో మునిగిపోయిన రైల్వే స్టేషన్లు కనిపించలేదా?
ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీలు రూపొంది సకల సౌకర్యాలతో ఉన్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీట మునుగుతున్న తరుణంలో.. ఏమీలేని సాధారణ లే అవుట్లు నీళ్లతో కాక.. ఇంకేలా ఉంటాయి? అడిగేవాడు లేక...! అని ఫైరవుతున్నారు సామాన్యులు!
దీంతో చంద్రబాబుతో కలిసి పవన్ కూడా పెత్తందారుల పక్షమే అని... పేదవాడికి సెంటునే ల ఇస్తే అందులో కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారని ఫైరవుతున్న ప్రజలు.. ఇంగితం, విజ్ఞత వంటి పదాలను తెరపైకి తెస్తున్నారు!