Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ ఆ చిన్న దీవి మీద టార్గెట్ చేస్తే.. ప్రపంచానికి ఆయిల్ సంక్షోభమే

ఒక చిన్న దీవి మీద ప్రపంచ ఆయిల్ అవసరాలు గడుస్తున్నాయా? అన్న ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం అవుననే చెప్పాలి.

By:  Tupaki Desk   |   13 Oct 2024 4:34 AM GMT
ఇజ్రాయెల్ ఆ చిన్న దీవి మీద టార్గెట్ చేస్తే.. ప్రపంచానికి ఆయిల్ సంక్షోభమే
X

ఒక చిన్న దీవి మీద ప్రపంచ ఆయిల్ అవసరాలు గడుస్తున్నాయా? అన్న ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం అవుననే చెప్పాలి. ఆ చిన్న దీవి ఇరాన్ అధీనంలో ఉంది. ఇరాన్ ను దెబ్బ తీయాలని భావించే ఇజ్రాయెల్ కానీ.. ఆ దీవి మీద దాడి చేసిందా? ప్రపంచానికి గడ్డు పరిస్థితులు దాపురించినట్లే. ఆ దీవి మీద దాడి జరిగినంతనే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భగ్గుమనటమే కాదు.. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.

ఇంతకూ ఆ దీవి ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? ఎందుకంత ప్రాధాన్యం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. పర్షియన్ గల్ఫ్ లోని ఇరాన్ తీరానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్న దీని ఉంది. అదే ఇరాన్ కు ఆయువుపట్టు. ఇక్కడి నుంచే భారీ ఎత్తున క్రూడాయిల్ ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు కూడా ఇక్కడి నుంచే ముడి చమురు ఎగుమతి అవుతుంది.

తనపై ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ కానీ ఈ దీవిని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తే మాత్రం.. ప్రపంచానికి గడ్డు పరిస్థితులు దాపురించినట్లే. దీనికి కారణం.. ఇక్కడి నుంచే ఇరాన్ కు చెందిన పలు దీవుల ద్వారా చమురు ఎగుమతి అవుతు ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఇతర దేశాలైన బ్రహయిన్.. ఖతార్.. కువైత్.. సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ ఈ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం.. హెర్ముజ్ జలసంధి. ఇక్కడి నుంచే పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది కూడా ఇరాన్ అధీనంలోనే ఉంది. ఒకవేళ ఇరాన్ కానీ ఈ జలసంధిని మూసివేస్తే.. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తక మానదు.

గతంలో జరిగిన ఇరాక్ - ఇరాన్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవి మీద దాడి చేయటంతో.. అప్పట్లో తీవ్రమైన ఆయిల్ సంక్షోభం ఎదురైంది. తమపై 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన ఇరాన్ కు తగిన పాఠం చెప్పాలని ఇజ్రాయెల్ తపిస్తోంది. ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ పై తమ దాడికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం ఇజ్రాయెల్ కౌంటర్ ఎటాక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం తెలిసిందే. అదే సమయంలో ఇరాన్ లోని అణుకేంద్రాలపై దాడి వద్దని సూచన చేశారు. దీంతో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఎక్కడ దాడి చేస్తుంది? దాని టార్గెట్ ఏమిటన్నది చూసినప్పుడు.. ‘‘ఖర్గ్’’ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా చెప్పొచ్చు.