Begin typing your search above and press return to search.

నస్రల్లా నలుసునూ మిగిల్చొద్దు.. ఇజ్రాయెల్ భీకర దాడి

నస్రల్లా అంతానికి గత వారం హెజ్బొల్లాల అడ్డా అయిన లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:30 AM GMT
నస్రల్లా నలుసునూ మిగిల్చొద్దు.. ఇజ్రాయెల్ భీకర దాడి
X

గత వారం ఉగ్ర సంస్థ హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను భీకర దాడితో హతమార్చిన ఇజ్రాయెల్ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో పని కూడా చేసింది. అయితే, అది ఎవరికీ పెద్దగా తెలియరాలేదు.. లేదా నస్రల్లా వంటి ఉగ్రవాదిని హతమార్చిన వేడిలో ఎవరూ పట్టించుకోలేదు.. ఇంతకూ ఇజ్రాయెల్ చేసిన ఆ పనేంటో తెలుసుకుంటే అందరూ నోరెళ్లబెడతారు. కాగా, నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలో రెండు రోజుల పాటు మంటలు రేగడం గమనార్హం. అత్యంత పకడ్బందీగా చేసిన ఈ దాడిలో నస్రల్లా ఏ మాత్రం తప్పించుకోలేపోయాడు. అతడి స్థానంలోకి వచ్చిన హెజ్‌బొల్లా నాయకుడిని ఏడు గంటల్లోపే మట్టుబెట్టింది. హెజ్బొల్లా నాయకత్వ చరిత్రలో ఇంత తక్కువ సమయం పదవిలో ఉన్నది ఇతడే.

ఇతడూ అంతర్జాతీయ ఉగ్రవాదే..

నస్రల్లా అంతానికి గత వారం హెజ్బొల్లాల అడ్డా అయిన లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. తాజాగా మరోసారి భారీ వైమానిక దాడి చేసింది. దీనికి కారణం నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్‌ సఫీద్దీన్‌. ఇతడిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) ఇంతవరకు స్పందించలేదు. నస్రల్లా లాగే హషీమ్‌ ఓ బంకర్‌ లో దాగి ఉన్నాడు. హెజ్‌బొల్లా సీనియర్ నేతలతో అతడు సమావేశం అయిన సమయాన్ని చూసి ఇజ్రాయెల్ దాడి చేసింది.

నస్రల్లా అంత్యక్రియల్లోపే..

నస్రల్లాను గత శుక్రవారం ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే, అతడి అంత్యక్రియలను ఈ శుక్రవారం జరగనున్నాయి. బీరుట్ లోనే దీనికి ఏర్పాట్లు చేశారు. ఈ లోపే నస్రల్లా వారుసుడిగా భావిస్తున్న హషీమ్‌ సఫీ అల్‌ దిన్‌ నూ చంపేసింది ఇజ్రాయెల్. అయితే, హషీమ్‌ గాయపడ్డాడా? అసలు పరిస్థితి ఎలా ఉంది? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. హషీమ్.. నస్రల్లాకు దగ్గరి బంధువు. 2017లోనే ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. హెజ్‌బొల్లా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్‌ హెజ్‌బొల్లాకు చెందిన జిహాద్‌ కౌన్సిల్‌లోనూ సఫీ అల్‌ దిన్‌ సభ్యుడు. అన్నింటికి మించి నస్రల్లాకు బంధువు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అధిపతి అయిన హషీమ్‌.. హెజ్బొల్లా అధిపతిగా నియమితులైనట్లు కథనాలు వచ్చినా.. అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కాగా, బీరుట్‌ ప్రధాన ఎయిర్‌ పోర్టు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయి నుంచి వచ్చిన విమానం ల్యాండ్‌ కొద్దిసేపటికే ఇలా జరిగింది.

బీరుట్‌ లోని దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాల భీకర దాడిలో నస్రల్లానే కాక.. ఇరాన్‌ డిప్యూటీ కమాండర్‌ జనరల్‌ అబ్బాస్‌ నీలోఫర్సన్, హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ అలీ కర్కి, మరికొంత మంది కమాండర్లూ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ 200 బాలిస్టిక్‌ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌ మీద విరుచుకుపడింది. కాగా, నస్రల్లాతో పాటే అతడి కుమార్తె కూడా చనిపోయింది. గతంలోనే నస్రల్లా కుమారుడూ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు సమీప బంధువు హషీమ్ నూ ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హెజ్బొల్లాకు దాదాపు నాయకత్వం లేకుండా చేసింది. అంటే.. నస్రల్లా నలుసు కూడా లేకుండా చేసింది.