ఇజ్రాయెల్ అసలైన రక్షణ కవచం ఏమిటి.. ఎలా పనిచేస్తుంది..?
ఈ సమయంలోనే.. ఇకపై తమదేశంపై శత్రుదేశాల రాకెట్లు పడకూడదని ఫిక్సయ్యింది. ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది.
By: Tupaki Desk | 25 Sep 2024 11:30 PM GMTఅది 2006 సంవత్సరం. హెజ్ బొల్లా – ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమయంలో హెజ్ బొల్లా సంస్థ వేల రాకెట్లను టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో.. అక్కడ భారీ ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే.. ఇకపై తమదేశంపై శత్రుదేశాల రాకెట్లు పడకూడదని ఫిక్సయ్యింది. ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది.
అవును... 2026లో హెజ్ బొల్లా దాడుల్లో భారీ ప్రాణనష్టం చవిచూసిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమెరికా సాయంతో పని మొదలుపెట్టింది. 2008నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది.. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. ఫైనల్ గా 2011లో పూర్తిస్థాయి ఐరన్ డోమ్ ను అందుబాటులోకి తెచ్చింది.
దీని సక్సెస్ రేటు 90 శాతానికి పైగానే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం అనే చెప్పాలి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చేసింది. అయితే... ఈ ఐరన్ డోమ్ ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంటున్నారు.
శత్రు రాకెట్లు దేశంపైకి దూసుకొస్తున్న సమయంలో.. ఒక్కో రాకెట్ ను పేల్చడానికి ఇది రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది.
వాస్తవానికి ఇజ్రాయేల్ డిఫెన్స్ వ్యవస్థ వివిధ దశల్లో పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి. ఇందులో యూరో-2, యూరో-3 సిస్టం లను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి అంతరిక్షంలోనే వాటిని పేల్చేస్తుంది. అనంతరం డేవింగ్ స్లింగ్ మద్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది.
దీన్ని 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోడానికి వాడతారు. ఇదే సమయంలో యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చడంలో దీనిది కీలక పాత్రగా ఉంటుంది. ఈ సమయంలో చిట్టవిచరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీన్ని స్థానికంగా కిప్పాట్ బర్జెల్ గా వ్యవహరిస్తరు. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి.
వీటిలో దూసుకొస్తున్న ముప్పును పసిగట్టడం రాడార్ పని. ఆ ముప్పు నేలను ఎక్కడ తాకుతుందో అంచనా వేస్తుంది. అది నేలపై పడే చోట ఎలాంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. ఒకవేళ ఆ ముప్పు జనావాసాలపై పడేట్టు ఉంటే.. వెంటనే రాకెట్ ను ప్రయోగించి దాన్ని ధ్వంసం చేస్తుంది. ఇలా ప్రతీ ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి.
ఇవి ఒక్కొక్కటీ 10 సెకన్ల వ్యవధిలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. దూసుకొచ్చే రాకెట్లను కూలివేయడానికి వాడే తమార్ క్షిపణుల్లో ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్లతో పాటు మల్టిపుల్ స్టీరింగ్ ఫిన్స్ ఉంటాయి. ఇవి కదలికలను సులువు చేస్తాయి. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఇది ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది.