Begin typing your search above and press return to search.

నన్నెవడ్రా ఆపేది అంటున్న ఇజ్రాయెల్ ప్రధాని.. వీడియో వైరల్!

అవును... హమాస్ తో కొనసాగుతున్న వివాదంపై తన సంకల్పాన్ని నొక్కి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 3:52 AM GMT
నన్నెవడ్రా ఆపేది అంటున్న ఇజ్రాయెల్  ప్రధాని.. వీడియో వైరల్!
X

ప్రస్తుతం పశ్చిమాసియాలో అత్యంత బిజీగా ఉన్న దేశం ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. చుట్టూ ఉన్న శత్రువులతో అవిరామంగా యుద్ధం చేస్తుంది ఆ దేశం. తనను తాను రక్షించుకుంటూ.. శత్రువులను ఒక్కొక్కరిగా ఏరి పారేస్తోంది. ఈ సమయంలో... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది.

దీంతో... ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ దాడిలో నెతన్యాహు నివాసం కొంత భాగం ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య నివాసంలో లేరు. ఈ క్రమంలో తాజాగా.. తన నివాసంపై జరిగిన దాడిని నేరుగా ప్రస్థావించకుండా నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. సంచలన స్టేట్ మెంట్లు ఇచ్చారు.

అవును... హమాస్ తో కొనసాగుతున్న వివాదంపై తన సంకల్పాన్ని నొక్కి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ సందర్భంగా "తనను ఏదీ అడ్డుకోదని" ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించబోతోందని పునరుద్ఘాటించారు. యూదుల విశ్రాంతి దినమైన షబ్బత్ రోజు ఓ అరుదైన వీడియో ప్రకటన చేశారు.

ఇంగ్లిష్, హిబ్రూ భాషల్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో నెతన్యాహు స్పందిస్తూ... రెండు రోజుల క్రితం సాముహిక హంతకుడు యాహ్యా సిన్వర్ ను తాము నిర్మూలించామని.. ఈ అస్తిత్వ యుద్ధాన్ని చివరి వరకూ కొనసాగిస్తామని అనారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలపై ప్రశంసల జల్లులు కురిపించారు ప్రధాని బెంజమిన్.

ఇందులో భాగంగా... సైనికుల గురించి, కమండర్ల గురించి తాన్ను గర్విస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే... సిన్వర్ గ్యాంగ్.. ఇజ్రాయెల్ మగవాళ్ల తలలు నరికి, ఆడవాళ్లపై అత్యాచారం చేసి, పిల్లలను సజీవ దహనం చేశారని.. ఉగ్రవాద ఫ్రాక్సీలతో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని.. విజయం సాధిస్తామని ధృడమైన ప్రకటనతో ముగించారు.

కాగా అంతక ముందు.. లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్, దక్షిణ జైఫాలోని సిజేరియాలో గల ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలింది. అయితే... దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, ఆయన భార్య అక్కడ లేరని ప్రధాని అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన నెతన్యాహు... తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన ఇరాన్ ఏజెంట్లు చాలా పెద్ద తప్పు చేశారని అన్నారు!