Begin typing your search above and press return to search.

350 సార్లు దాడి... మరో దేశంతో ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టేసినట్లే..!

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోదేశంపై రివేంజ్ తీర్చుకునే పనికి పూనుకుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.

By:  Tupaki Desk   |   15 Dec 2024 3:47 AM GMT
350 సార్లు దాడి... మరో దేశంతో  ఇజ్రాయెల్  యుద్ధం మొదలుపెట్టేసినట్లే..!
X

ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన దేశాల్లో ఇజ్రయెల్ ఒకటి. ఇజ్రయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన ఊచకోత అత్యంత భయానకంగా మారిన వేళ.. అంతక ముంచి కొన్ని వందల రెట్లు వినాశనం గాజా కేంద్రంగా సృష్టించింది ఇజ్రాయెల్! హమాస్ ఉగ్రవాదులు పశ్చాత్తప పడేస్థాయిలో విరుచుకుపడింది.

ఇప్పటికే గాజా మొత్తం అల్లల్లాడిపోతోందని.. ఆ ప్రాంతం మొత్తం కూలిన భవనాలు, అవి మిగిల్చిన శిథిలాలు, వాటి కింద ఉన్న శరీర భాగాలు, చెల్లాచెదురుగా పడిఉన్న శవాలతో నిండిపోయిందని చెప్పిన అతిశయోక్తి కాదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక హమాస్ సంస్థ తమ అధినేతనూ కోల్పోయింది. అయినప్పటికీ వారికి పశ్చాత్తాపం వచ్చినట్లు లేదు!

ఇక అనంతరం హిజ్ బొల్లా ఉగ్రవాదులు, ఇరాన్ ఎంట్రీ తో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరోపక్క ఇజ్రాయెల్ కు అన్ని విధాలుగానూ అగ్రరాజ్యం అమెరికా అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోదేశంపై రివేంజ్ తీర్చుకునే పనికి పూనుకుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.

అవును... సిరియా రాజధాని డమాస్కస్, దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణులు ఉన్నట్లు సిరియా సైనిక వర్గాలు వెల్లడించగా.. పర్వాతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధ సామాగ్రిని ఇజ్రాయెల్ సైన్యం (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ - ఐడీఎఫ్) ధ్వంసం చేసిందని అంటున్నారు.

ఈ మేరకు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్.ఓ.హెచ్.ఆర్. స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఆయుధ డిపోలను, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను కూడా ఐడీఎఫ్ బలగాలు నాశనం చేశాయని ఎస్.ఓ.హెచ్.ఆర్. వెల్లడించింది. ఇదే సమయంలో మిలటరీ శాస్త్ర సాంకేతిక విభాగాలకు చెందిన సామాగ్రిని కూడా నాశనం చేసినట్లు పేర్కొంది.

కాగా.. గతంలో ఇజ్రాయెల్ పైకి సిరియా కెమికల్ ఆయుధాలను ప్రయోగించింది. ప్రస్తుతం ఆ దేశాన్ని విడిచి అధ్యక్షుడు అసద్ పారిపోయాడు. దీంతో... ఇదే సరైన సమయమని భావించిన ఇజ్రాయెల్.. తమకు నష్టం కలిగించేలా ఉన్న సిరియా యుద్ధ సామాగ్రిని, మిలటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేసే పనికి పూనుకుందని అంటున్నారు.

పైగా... ఈ విషయంలో సైన్యానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని అంటున్నారు. అవసరమైతే అక్కడ కొన్నాళ్ల పాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకుని.. పని పూర్తి చేసి రావాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మరోపక్క సిరియా స్థావరాలే లక్ష్యంగా ఇప్పటికే 350 సార్లు దాడి చేసినట్లు ఐడీఎఫ్ ధృవీకరించింది.