Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ లో భారతీయులు ఎందరు? వారిలో తెలుగువాళ్లు ఎంతమంది?

ప్రపంచంలోని ఏ మారుమూల దేశానికి వెళ్లినా అక్కడ ఏదేశం వారు ఉన్నా లేకున్నా భారతీయులు పక్కాగా ఉంటారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:30 PM GMT
ఇజ్రాయెల్ లో భారతీయులు ఎందరు? వారిలో తెలుగువాళ్లు ఎంతమంది?
X

ప్రపంచంలోని ఏ మారుమూల దేశానికి వెళ్లినా అక్కడ ఏదేశం వారు ఉన్నా లేకున్నా భారతీయులు పక్కాగా ఉంటారు. భారతీయులు అన్నంతనే తెలుగు వారు ఖాయంగా ఉండటం కనిపిస్తుంది. అలా ఏ దేశంలో అయినా తెలుగోళ్ల నెట్ వర్కు ఉంటుందని చెప్పాలి. మారుమూల దేశాల్లోనే ఉండే భారతీయులు.. తెలుగువారు ఉన్నప్పుడు పశ్చిమాసియాలోని కీలక దేశమైన ఇజ్రాయెల్ లో భారతీయులు భారీగా ఉంటారు. తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే.

తాజాగా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తున్న వేళ మనోళ్ల సంగతి మీద ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడున్న మనోల్లు ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ దేశంలో మొత్తం 18 వేల మంది భారతీయ పౌరులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఇంతమంది ఇజ్రాయెల్ లో ఏం చేస్తారు? అన్న విషయంలోకి వెళితే.. ఆ దేశంలో మనోళ్లు ఎక్కువగా డైమండ్ ట్రేడర్స్.. ఐటీ ప్రొఫెషనల్స్, వ్యాపారులుగా ఉంటారు. కేర్ టేకర్స్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారని చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత సంతతికి చెందిన యూదులు కూడా భారీగానే ఉన్నారు.ఒక అంచనా ప్రకారం 85 వేల మంది భారత సంతతి యూదులు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వేలాది భారతీయుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ఎక్కువగానే ఉన్నారు. ఉద్యోగ.. విద్య అవకాశాల కోసం ఆ దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పని చేయటానికి గతంలో పాలస్తీనా నుంచి రోజు 18 వేల మంది కార్మికులు వచ్చి వెళుతుండేవారు. కానీ హమాస్ దాడి తర్వాత నుంచి వారిని పనికి తీసుకోవటం ఇజ్రాయెల్ ఆపేసినట్లుగా మనోళ్లు చెబుతున్నారు. వారికి బదులుగా మనోళ్లను.. శ్రీలంక పైరుల్నిపనికి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం ముదిరే కొద్దీ.. ఇంత భారీగా ఉన్న భారతీయుల యోగక్షేమాలు.. వారిని స్వదేశీనికి తీసుకురావటం తలకు మించిన భారంగా మారుతుంది. వీలైనంత త్వరగా యుద్ధం ముగియటం ఇరాన్.. ఇజ్రాయెల్ కు మాత్రమే కాదు మనకు కూడా చాలా అవసరమని చెప్పాలి.