మేము చనిపోయినా మా ప్రేమ బ్రతకాలి...లాస్ట్ కిస్ పిక్ వైరల్!
ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యం గాజాపై జరుపుతున్న దాడి కంటే అది కొన్ని వందల రెట్లు పెద్దదని చెబుతుంటారు
By: Tupaki Desk | 13 Oct 2023 4:30 AM GMTచిన్న చిన్న కారణాలకు, కారణం కాని కారణాలకూ సైతం బ్రేకప్ లు చెప్పేసుకుంటూ.. ప్రేమికులం అని చెప్పుకు తిరుగుతున్న జంటలున్న ఈరోజుల్లో.. చనిపోయే ముందు, చావుకు కొన్ని నిమిషాల ముందు అని భావించి చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఒక జంట పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది! చావైనా.. బ్రతుకైనా.. నీతోనే.. అన్నట్లుగా ఆ జంట చివరి పిక్ అని తీసుకున్న ఫోటోపై కామెంట్ చేయలేక మౌనంగా కళ్లతో భావాలు పలికిస్తున్నారు "ప్రేమికులు"!
అవును... ప్రేమ ఎంత మధురం? సమాధానం చెప్పలేని ప్రశ్నల్లో ఇదొకటి అని కొంతమంది చెబుతుంటారు! అనుభవించే అంశంలో కాదు.. దాన్ని అనుభవించే విధానంలో దాని గొప్పతనం దాగిఉంటుందని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం అత్యంత భీకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అత్యంత పాశవికంగా ఇజ్రాయేల్ లోని ఒక మ్యూజిక్ ఫెస్ట్ లో జరిగిన ఉగ్రదాడి అత్యంత ఘోరం!
ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యం గాజాపై జరుపుతున్న దాడి కంటే అది కొన్ని వందల రెట్లు పెద్దదని చెబుతుంటారు. కారణం... ఏమాత్రం హెచ్చరికలు లేని దాడి, యుద్ధం ఆరంభం అవ్వడానికి ప్రధానమైన దాడి.. అంతకంటే ముందు... ఇది ఒక "ఉగ్ర"దాడి! ఈ దాడిలో ఇప్పటివరకూ గుండెను మెలిపెట్టిన ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర కాపుకాసి మరీ కాల్పులు జరిగిన సంఘటనలు ఒకెత్తు అయితే... చనిపోయినట్లు నటిస్తున్న వారి దగ్గరకు వచ్చి శ్వాస చెక్ చేసి మరీ కాల్పులు జరిపిన సంఘటనలు మరొకెత్తు. ఇలాంటి ఘోరకలికి సంబంధించిన ఫోటో మరొకటి తాజాగా వైరల్ అవుతుంది. ఇక మరికొన్ని నిమిషాల్లో చనిపోతాం అని భావించిన ఒక ప్రేమజంట చివరిగా తీసుకొన్న పిక్ అది!
వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయిల్ లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో 260 మంది ఊచకోత ఘటనలో ఒక ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్ పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో ఇక చచ్చిపోతామని తెలిసి... చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్ బర్డ్స్ ఫోటో అది!
ఆ దాడి సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక జంట పొదల్లో దాక్కొన్నారు. ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన "అమిత్ - నిర్" లు నేలపై పడుకుని, పెదాలతో చుంభించుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము చనిపోయినా తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే వారి నిష్కల్మషమైన ప్రేమే వారికి ఆయువు పోసిందో ఏమో కానీ... వారు బ్రతికారు!
జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్‌స్టాగ్రాం పేజీ తాజాగా వారి ఫోటోను క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. “ఇజ్రాయెల్ లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ లో అమిత్ - నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది! అదృష్టవసాత్తు వారు ప్రాణాలతో బైటపడ్డారు. ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది" అని పేర్కొంది. ఈ ఫోటోపై నెటిజన్లు చాలా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. "ఎంత అద్భుతం.. ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది" అంటూ కవితాత్మకంగా రియాక్ట్ అవుతున్నారు.