"అక్టోబర్ 7న మీ కళ్లు ఎటుపోయాయి"... ఇజ్రాయేల్ స్ట్రాంగ్ రియాక్షన్!
దాడిలో 45 మంది మృతి చెందిన విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయేల్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.
By: Tupaki Desk | 30 May 2024 6:42 AM GMTఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతోన్న పోరు ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెట్టింట ఈ ఇష్యూ వైరల్ గా మారుతుంది. ప్రధానంగా గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ జరిగిన దాడిలో 45 మంది మహిళలు, చిన్నారులూ ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీంతో... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు.. "ఆల్ ఐస్ ఆన్ రఫా" అనే ఇమేజ్ ను షేర్ చేస్తూ కాల్పులు విరమణకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇన్ స్టాగ్రాంలో సుమారు 45 మిలియన్ల మంది దానిని షేర్ చేయగా... ఎక్స్ లో సుమారు 27.5 మిలియన్ల మెసేజ్ లు పబ్లిష్ అయ్యాయని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.
అవును... గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ జరిగిన దాడిలో 45 మంది మృతి చెందిన విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయేల్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఎక్స్ వేదికగా ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ ఒక పోస్టర్ వదిలింది.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి గురించి ఎందుకు పోస్టు చేయలేదని, ఆ రోజు మీ అందరి దృష్టి ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తూ ఓ ఇమేజ్ పోస్ట్ చేసింది ఇజ్రాయేల్. ఈ సందర్భంగా... "మేం అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం. బందీలు విడుదలయ్యే వరకు పోరాటాన్ని ఆపం" అని స్పష్టం చేసింది.
కాగా... సుమారు ఏడు నెలల క్రితం ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓ మ్యూజిక్ ఫెస్ట్ ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపారు. ఈ దాడిలో సుమారు 1,160 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మంది బందీలుగా మారారు. మృతులు, బాధితుల్లో చాలామంది సామాన్య పౌరులే ఉన్నారని ఇజ్రాయేల్ తెలిపింది.
దీంతో... హమాస్ మిలిటెంట్ అనే పదం వినిపించకుండా చేయడమే లక్ష్యం అంటూ గాజా స్ట్రిప్ వెంబడి ఇజ్రాయెల్ భారీ పోరాటం చేస్తుంది. ఈ పోరులో ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోన్నప్పటికీ.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రం తగ్గడం లేదని అంటున్నారు!