Begin typing your search above and press return to search.

రఘురామ కేవలం ఎమ్మెల్యే మాత్రమే...ఎందుకంటే ?

అయితే రఘురామ క్రిష్ణంరాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ ఈసారి ఉండి నుంచి గెలిస్తే కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 May 2024 3:30 PM GMT
రఘురామ కేవలం ఎమ్మెల్యే మాత్రమే...ఎందుకంటే ?
X

టీడీపీ అధికారంలోకి వస్తే రఘురామ క్రిష్ణంరాజు స్పీకర్ అవుతారని ఒక వైపు ప్రచారం సాగింది. కాదు ఆయన హోం మినిస్టర్ అవుతారు అని మరో వైపు చర్చ సాగింది. ఇలా ఆయనకు టీడీపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పొజిషన్ ఉంటుందని కూడా ఆయన అనుచరులతో పాటు అంతా భావించారు.

అయితే రఘురామ క్రిష్ణంరాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ ఈసారి ఉండి నుంచి గెలిస్తే కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు అని అంటున్నారు. ఎందుకు అంటే స్పీకర్ పదవి అంటే రాజ్యాంగ బద్ధమైన పదవి. దానికి పార్లమెంటరీ రూల్స్ బిజినెస్ రూల్స్ అన్ని తెలియాల్సి ఉంది. సీనియర్లు చాలా మంది చట్ట సభలలో బిజినెస్ ని చూసిన వారికి మాత్రమే స్పీకర్ పదవిని నిభాయించే పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు.

స్పీకర్ అంటే షార్ట్ టెంపర్ ఉండకుండా అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ వెళ్లాలి. సో ట్రిపుల్ ఆర్ కి ఆ పదవి సూట్ కాదు అని అంటున్న వారూ ఉన్నారు. ఇక మంత్రి పదవి ఇచ్చినా ఏం మాట్లాడి ఏమి కొంప ముంచుతాడో అన్నది కూడా ఉందిట. అపుడు టీడీపీ కూటమికే పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది అని అంటున్నారు.

ఇక ట్రిపుల్ ఆర్ కి మంత్రి పదవి ఇస్తే ఆయన కచ్చితంగా జగన్ ని టార్గెట్ చేస్తాడు. అయితే అలా జరగడం బాబుకు ఇష్టం ఉండదు అని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బాబు ట్రిపుల్ ఆర్ కి పదవి ఇచ్చి జగన్ ని టార్గెట్ చేయించి ఆయనకు సానుభూతి పెంచేటంతగా వ్యవహారాన్ని బూమరాంగ్ చేసుకోరు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ట్రిపుల్ ఆర్ ముందు గెలవాలి కదా అపుడు పదవుల సంగతి అని కొందరు అంటున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ పోటీ చేస్తున్న ఉండిలో గట్టి పోటీ ఉందని అంటున్నారు. The అక్కడ టీడీపీ రెబెల్ గా శివరామరాజు పోటీ చేస్తున్నారు. ఆయనకు అవసరం అయిన బలం బలగం నిండుగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు చీలిపోయాయని అంటున్నారు.

అక్కడ ట్రిపుల్ ఆర్ గెలవరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ట్రిపుల్ ఆర్ గెలిచినా ఆయనకు ఒక ఎమ్మెల్యేగానే ప్రాధాన్యత ఇస్తారు తప్ప చంద్రబాబు ఆయనకు ఏ పదవీ ఇవ్వరని అంటున్నారు. అపోజిషన్ లో జగన్ కనుక లేచి నిలబడి మాట్లాడితే ఆయన మీద మాటల దాడి చేసేందుకు ట్రిపుల్ ఆర్ ని ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ట్రిపుల్ ఆర్ కి వెటకారం బాగా ఎక్కువ అని అతి చేస్తూ ఉంటారని అంటారు. అది మీడియా ముందు చెల్లుతుంది తప్ప అసెంబ్లీలో మాట్లాడే భాష మాత్రం అది కానే కాదని అంటున్నారు. అందువల్ల చంద్రబాబు ట్రిపుల్ ఆర్ విషయంలో ఏమి చేయాలో ఇప్పటికే డిసైడ్ అయి ఉంటారని అంటున్నారు.

దాంతో ట్రిపుల్ ఆర్ స్పీకర్ అని హోం మినిస్టర్ అని ప్రచారం చేసుకుంటున్న వారుకి నిరాశ తప్పదనే అంటున్నారు. అయినా అయిదేళ్ల లాంగ్ గ్యాప్ తరువాత టీడీపీ అధికారంలోకి వస్తే ఆశావహులు లెక్కలు మిక్కిలిగా ఉంటారు. అందులో అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు ఎంతో మంది ఉంటారు.

ఇక టీడీపీ కూటమి కట్టింది. అలా మిత్రులకు కొన్ని మంత్రి పదవులు పోతాయి. దాంతో చాలా కీలకంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దాంతో బెస్ట్ లో ది బెస్ట్ అన్నట్లుగా అన్ని రకాలైన సమీకరణలను చూసి మరీ ఎంపిక చేస్తారు తప్ప అందరికీ అక్కడ కుర్చీ వేయడానికి అది పుష్పక విమానం కానే కాదని అంటున్నారు. చూడాలి మరి ట్రిపుల్ ఆర్ రాజకీయ జాతకం ఎలా ఉంటుందో.