Begin typing your search above and press return to search.

బీజేపీలో సగం సీట్లు వస్తే చాలు రాహుల్ ప్రధాని ?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు వాసం తలచుకుని విపక్షాలు అన్నీ ఎన్నడూ లేనంతగా ఐక్యతను చూపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:30 AM GMT
బీజేపీలో సగం సీట్లు వస్తే చాలు రాహుల్ ప్రధాని ?
X

దేశంలో ఈసారి ఎన్నికలు డూ ఆర్ డై గానే మారుతున్నాయి. ఈసారి కనుక అధికారంలోకి రాకపోతే ఇబ్బందే అని కాంగ్రెస్ సహా విపక్షాలు భావిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు వాసం తలచుకుని విపక్షాలు అన్నీ ఎన్నడూ లేనంతగా ఐక్యతను చూపిస్తున్నాయి.

రేపు ఫలితాలు వచ్చి బీజీపీకి సీట్లు తగ్గితే తటస్థంగా ఉన్న పార్టీలు వీలైతే ఎన్డీయేలోని పార్టీలు కూడా ఒక్క త్రాటి మీదకు వస్తారని అంటున్నారు. ఎందుకంటే మోడీ మూడోసారి పీఎం అయితే మాత్రం విపక్షానికి అసలు ఉనికి పోరాటమే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్ సర్వేల పేరుతో దేశంలో వివిధ ప్రముఖ సంస్థలు రిలీజ్ చేసిన నివేదికలను ఇండియా కూటమి పూర్తిగా తిరస్కరిస్తోంది. అవి మోడీ సర్వేలు తప్ప ఎగ్జిట్ పోల్ సర్వేలు కానే కావని రాహుల్ గాంధీ అంటే ఫేక్ సర్వేలు అంటూ జైలుకు వెళ్ళే ముందు అరవింద్ కేజ్రీవాల్ కూడా భారీ డైలాగ్ వదిలారు. రాజస్థాన్ లో 25 లోక్ సభ సీట్లు ఉంటే 34 సీట్లలో బీజేపీ క్లీన్ స్వీప్ అంటూ సర్వేలు చెప్పడం కంటే జోక్ ఉంటుందా అని ప్రశ్నించారు.

ప్రజల మూడ్ పట్టని ఈ సర్వేలకు అసలు ఫలితాలు దిమ్మదిరిగే జవాబు చెబుతాయని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఇక ఇండియా కూటమి ఈసారి చాలా ధీమాగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఉత్తరాదిన రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర అలాగే హిమాచల్ ప్రదేశ్, అసోం వంటి చోట్ల బాగా సీట్లు పెరుగుతాయని భావిస్తోంది. సౌత్ లో చూసుకుంటే కేరళలో ఈసారి తమకు మంచిగానే సీట్లు దక్కుతాయని అంటున్నారు.

అదే విధంగా కర్నాటక తెలంగాణాల మీద ఆశ పెట్టుకుంది కాంగ్రెస్. ఇక మిత్రులు గెలిచే సీట్లు తీసుకుంటే తమిళనాడులో డీఎంకే స్వీప్ చేస్తుందని ఢిల్లీ పంజాబ్ లలో ఆప్ తన సత్తా చాటుతుందని, బీహార్ లో లాలూ మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన పార్టీలు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఎక్కువ సీట్లు సాధిస్తారు అన్న నమ్మకంతో ఉంది.

ఇలా కాంగ్రెస్ 2019లో సాధించిన 54 సీట్ల కంటే డబుల్ సాధించగలమని నమ్ముతోంది. 125 ఎంపీ సీట్లు వస్తే చాలు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 273 మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా ఆ మిగిలిన 147 ఎంపీలు మిత్రుల నుంచి వస్తాయని కాంగ్రెస్ ప్రగాఢంగా నమ్ముతోంది.

అంతే కాదు న్యూట్రల్ గా ఉండే బిజూ జనతాదళ్ ఏపీలోని వైసీపీ తెలంగాణాలోని బీఆర్ఎస్ వంటి పార్టీలు లాస్ట్ మినిట్ లో అయినా సహకరిస్తాయని ఇండియా కూటమి నమ్ముతోంది. అందువల్ల బీజేపీకి సొంతంగా 200 సీట్లు వచ్చినా ఎన్డీయే మిత్రులకు పాతిక నుంచి ముప్పయి కంటే ఎక్కువ సీట్లు రావని ఇండియా కూడా లెక్క వేస్తోంది.

దాంతో తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తోంది. ఇక రెండు సార్లు కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. ఈసారి కనుక ఓడితే మాత్రం కచ్చితంగా తెర వెనకే అన్న భావన కూడా ఉంది. కాంగ్రెస్ ఎపుడూ సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో కూర్చోలేదు. కాంగ్రెస్ చరిత్రలో 1977లో ఇందిరా గాంధీ నాయకత్వంలో మొదటిసారి ఓటమి చూసింది. అయితే మూడేళ్లు తిరగకుండానే అధికారం తిరిగి కాంగ్రెస్ పరం అయింది.

అలాగే 1989లో రెండోమారు రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. అయినా రెండేళ్ళు తిరగకుండానే 1991లో అధికారం కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది. ఇక 1996 నుంచి రెండేళ్ళ పాటు యునైటెడ్ ఫ్రంట్ ని కాంగ్రెస్ అంతా తానై నడిపించింది. 1998 నుంచి 2004 వరకు మాత్రం ఆరేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చుంది.

అలా అదే పెద్ద సమయం అనుకుంటే దానికి మించిన తీరులో 2014 నుంచి 2024 దాకా పదేళ్ళ పాటు అపొజిషన్ బెంచ్ కే కాంగ్రెస్ ని మోడీ పరిమితం చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ ఓటమి పాలు అయితే పదిహేనేళ్ళు అవుతాయి. అది కాంగ్రెస్ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి అధికారం తమదే అని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోడీకే పట్టం కట్టాయి. అసలైన ఫలితాలు ఎవరిని వరిస్తాయో చూడాల్సి ఉంది.