Begin typing your search above and press return to search.

యూదులకు ఇజ్రాయేల్ - హిందువులకు ఇండియా... కంగనా వైరల్ కామెంట్స్!

ఇందులో భాగంగా... "నా మనసంతా ఇజ్రాయెల్ గురించే ఆలోచిస్తోంది. మా హృదయాలు రక్తమోడుతున్నాయి" అంటూ ఓ వీడియో క్లిప్ ను నెటిజన్లతో పంచుకుంది.

By:  Tupaki Desk   |   26 Oct 2023 7:40 AM GMT
యూదులకు ఇజ్రాయేల్ - హిందువులకు ఇండియా... కంగనా వైరల్  కామెంట్స్!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయేల్ - హమాస్ యుద్దం గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ సహా.. యూఎస్, యూకే, ఫ్రాన్స్ మొదలైన దేశాలన్నీ ఇజ్రాయేల్ కు మద్దతు తెలిపుతున్నాయి. ఈ సమయంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ ను కలిశారు. ఈ సందర్భంగా కొంతసమయం ఆయనతో ముచ్చటించిన కంగనా.. అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు!


అవును... భారత్ లోని ఇజ్రాయేల్ రాయబారి నార్ గిలాన్ ను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కలిశారు. ఇజ్రాయేల్ కు యూదులకూ తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో... హమాస్ ను ఆధునిక రావణుడిగా కంగనా కంపేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ భేటీకి సంబంధించిన నార్ గిలాన్ తో ఉన్న ఫోటోలను, ఆయనతో సంభాషించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి!


ఇందులో భాగంగా... "నేడు ప్రపంచం మొత్తం.. ముఖ్యంగా ఇజ్రాయెల్ - భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. నిన్న నేను రావణ దహనం కోసం ఢిల్లీ చేరుకున్నప్పుడు.. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి వచ్చి నేటి ఆధునిక రావణుడిని, హమాస్ వంటి ఉగ్రవాదులను ఓడించే వ్యక్తులను కలవాలని భావించాను" అని కంగనా రనౌత్ తెలిపారు.


ఇదే సమయంలో... "చిన్న పిల్లలు, మహిళలను టార్గెట్ చేస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అతనితో నేను నా రాబోయే చిత్రం తేజస్ మరియు భారతదేశం యొక్క స్వీయ ఆధారిత యుద్ధ విమానం తేజస్ గురించి చర్చించాను" అని ఇన్ స్టా లో పోస్ట్ చేసింది కంగనా!

అనంతరం ఒక వీడియోను కూడా కంగనా విడుదల చేశారు. ఇందులో భాగంగా... "నా మనసంతా ఇజ్రాయెల్ గురించే ఆలోచిస్తోంది. మా హృదయాలు రక్తమోడుతున్నాయి" అంటూ ఓ వీడియో క్లిప్ ను నెటిజన్లతో పంచుకుంది. ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ కు, యూదులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ విషయం గురించి తాను ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగా చెప్పినట్లు తెలిపింది.

అనంతరం... యూదులకు ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయేల్ ఎలా ఉందో.. హిందువులకు ప్రత్యేకంగా భారత్ ఉండాల్సిందే అని, అందుకు తాము అర్హులం అని చెప్పుకొచ్చింది. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్నట్లే, యూదులు కూడా ఎదుర్కొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

దీంతో... “ఎవరి ముఖస్తుతి కోసం ఈ వ్యాఖలు” అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. “పాలస్థీనాను పాకిస్థాన్ తో, హమాస్ ను ఐ.ఎస్.ఐ. తో పోల్చడం వరకూ ఓకే కానీ... భారత్ ను ఇజ్రాయేల్ తో, హిందువులను యూదులతో పోల్చడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో” అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా... “ఎన్నికల వేళ బీజేపీ వదిలిన బాణం” అని ఇంకొంతమంది కామెంట్ చేస్తుండగా... “భిన్నత్వంలో ఏకత్వం అంటే తెలియని అమాయకత్వం/మూర్ఖత్వం ఈమె సొంతం” అని మరికొంతమంది స్పందిస్తున్నారు!