జనవరి 16న మొదలు మార్చి 13కి ఫినిష్... ఇస్రో గ్రేట్ సక్సెస్!
ఈ మేరకు ఇస్రో నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఇస్రోకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
By: Tupaki Desk | 13 March 2025 3:17 PM ISTభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో అంత్గరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో భాగంగా... స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది.
అవును... అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పని స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఈ మేరకు ఇస్రో నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఇస్రోకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్... ఈ విజయం ప్రతీ భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందని.. నమ్మశక్యం కాని డీ డాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు పూర్తి చేశాయని.. భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్-4 గగన్ యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు మార్గాన్ని సుమగం చేసిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఈ ప్రయోగాలను పునఃప్రారంభించేందుకు ఇస్రో సిద్దమైంది. ఈ క్రమంలో మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు!
కాగా... గత ఏడాది డిసెంబర్ 30న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60లో రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ఈ సందర్భంగా ఈ పీఎస్ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1-బి... 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటిని డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చినప్పటికీ... ఫైనల్ గా ఈ ఏడాది జనవరి 16న వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా వీటి మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఈ రెండు ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ సక్సెస్ అయినట్లు తాజాగా ఇస్రో ప్రకటించింది.