నాడు సైకిల్ పై సామాన్లు.. నేడు స్పేడెక్స్ డాకింగ్.. ఇంట్రస్టింగ్ పోస్ట్!
ఈ సందర్భంగా ఈ ఘతనకు సంబంధించిన అప్ డేట్ ను ఎక్స్ ద్వారా వెల్లడించింది.
By: Tupaki Desk | 16 Jan 2025 10:22 AM GMTభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. ఇందులో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఈ ఘతనకు సంబంధించిన అప్ డేట్ ను ఎక్స్ ద్వారా వెల్లడించింది. భారతీయులందరికీ అభినందనలు తెలిపింది. ఈ సమయంలో డాట్ ఇండియా ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది.
అవును... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. ఇందులో భాగంగా... ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా అనుసంధానం చేసింది. దీనిపై స్పందించిన మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ ప్రతిష్టాత్మకం అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలక మెట్టుగా నిలిచిందని తెలిపారు.
ఇదే సమయంలో... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా... ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా డాకింగ్ చేయడం ద్వారా అద్భుతమైన మైలురాయిని సాధించారని.. రాబోయే కాలంలో దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుందని తెలిపారు.
ఈ సమయలో డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్ (డాట్ ఇండియా) ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... సైకిల్ పై రాకెట్ పరికరాలను తీసుకెళ్లడం దగ్గర నుంచి నేడు స్పేడెక్స్ డాకింగ్ వరకూ ఇస్రో ప్రయాణం అంటూ నాటి ఫోటోను, నేటి తాజా ఘనతకు సంబంధించిన వీడియోను కలిపి పోస్ట్ చేసింది. ఇది వైరల్ గా మారింది.
కాగా... 2024 డిసెంబర్ 30న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ60 (పీ.ఎస్.ఎల్.వీ)లో రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ వెహికల్ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ - 1బి... 15.12 నిమిషాలకు స్పేడెక్స్ - 1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి.
ఈ నేపథ్యంలో తాజాగా వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టింది ఇస్రో. ఈ సందర్భంగా వీటి మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించారు. ఇక్కడ ఈ రెండు ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాజా ప్రక్రియ సక్సెస్ అయ్యిందని ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.