Begin typing your search above and press return to search.

పుష్పక్ ప్రయోగం విజయవంతం.. ఎయిర్ ఫోర్స్ లో చేరిన హెలికాప్టర్

అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో విజయవంతం చేస్తోంది. పలు రకాల పరీక్షలు జరిపి మన కీర్తిని ఇనుమడింప చేస్తోంది

By:  Tupaki Desk   |   22 March 2024 5:36 AM GMT
పుష్పక్ ప్రయోగం విజయవంతం.. ఎయిర్ ఫోర్స్ లో చేరిన హెలికాప్టర్
X

అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో విజయవంతం చేస్తోంది. పలు రకాల పరీక్షలు జరిపి మన కీర్తిని ఇనుమడింప చేస్తోంది. చంద్రయాన్ -3ని విజయవంతం చేయడంతో ప్రపంచంలోని పలు దేశాలు మన దేశ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తున్నాయి. దేశంలో పలుప్రయోగాలు చేస్తూ దూసుకుపోతోంది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించి మరోమారు సత్తా చాటింది.

దేశంలో వినూత్నంగా పుష్పక్ అనే అయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ను రూపొందించింది. 4.5కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ వదిలేసి ప్రయోగాన్ని పరీక్షించింది. అక్కడ నుంచి స్వతంత్రంగా చల్లకెరె రన్ వేపై పుష్పక్ ల్యాండ్ కావడం గమనార్హం. దీంతో పుష్పక్ తో పలు ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. మన సైనిక్ విభాగంలో దాన్ని చేర్చి ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తోంది.

రక్షణ రంగానికి మన దేశం కేటాయింపులు భారీగానే చేపడుతోంది. ఇందులో భాగంగానే రూ. లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తోంది. ఇతర దేశాలతో (చైనా, పాకిస్తాన్ ) ఉన్న విభేదాల కారణంగా మన రక్షణ రంగ బడ్జెట్ విపరీతంగా పెరిగేలా చేస్తోంది. దీనికి గాను మనం పలు రకాల ఆయుధాలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఉన్నపళంగా మనకు యుద్ధం వస్తే ఎలా అనే ఉద్దేశంతోనే మన దేశం పలు మార్గాలు అన్వేషిస్తోంది.

దేశీయంగా మన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే పుష్పక్ హెలికాప్టర్ ను తయారు చేసింది. వీలైనన్ని హెలికాప్టర్ ను తయారు చేసి మనకు ధైర్యం తెచ్చుకునే పనిలో పడింది. దీని కోసం మన ఇస్రో ఇలా పలు రకాల పద్ధతుల్లో సైన్యానికి ఖర్చు తగ్గించే ఏర్పాట్లు చేస్తోంది. దీనికి గాను అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గేందుకు ఆర్ఎల్ వీలను ఇస్రో తయారు చేస్తోంది.

ఈనేపథ్యంలో పుష్పక్ హెలికాప్టర్ తయారులో మన అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతం అయింది. దీంతో మన సైన్యానికి మంచి ఆయుధం లభించినట్లు అయింది. దీని ప్రయోగం విజయం కావడంతో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టి మనకు అత్యవసర సమయాల్లో ఆదుకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్పక్ హెలికాప్టర్ పనితీరు బాగుందని పలువురు ప్రశంసలు కురిపించారు.