Begin typing your search above and press return to search.

అత్యంత ఖరీదైన వస్తువు ఇదే కానీ... భూమిపై లేదు!

అవును... ఈ ప్రపంచంలో మానవ నిర్మిత అత్యంత ఖరీదైన వస్తువు ఏది అంటే.. ఉంది కానీ.. అది భూమిపై లేదు అనే సమాధానం వస్తుంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 10:30 AM GMT
అత్యంత ఖరీదైన  వస్తువు ఇదే కానీ... భూమిపై లేదు!
X

ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏదంటే చెప్పడం చాలా కష్టమనే అంటారు. ఇక మరికొంతమంది తత్వవేత్తలు, కవులు, ప్రేమికులను ఈ మాట అడిగితే.. అది ప్రేమ మాత్రమే అని సమాధానం చెబుతారు. అయితే మానవులు సృష్టించిన అత్యంత ఖరీదైన వస్తువు ఏది అంటే... ఇప్పుడు అత్యంత ఆసక్తికర సమాధానం తెరపైకి వచ్చింది.

అవును... ఈ ప్రపంచంలో మానవ నిర్మిత అత్యంత ఖరీదైన వస్తువు ఏది అంటే.. ఉంది కానీ.. అది భూమిపై లేదు అనే సమాధానం వస్తుంది. అదే... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.). మనిషి నిర్మించిన అత్యంత ఖరీదైన వస్తువుగా ఇప్పుడు దీన్నే చెబుతున్నారు. దీనికి సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అయ్యిందంట!

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) అత్యంత ఖరీదైన మానవ నిర్మిత వస్తువు. దీని చివరి ఖర్చు సుమారు 0 బిలియన్లు ఉంటుంది అని గిన్నీస్ వరల్ద్ రికార్డ్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది! దీని నిర్మాణంలో సుమారు 14 దేశాలు పాలుపంచుకున్నాయి.

ఇది భూకక్ష్యలో వ్యోమగాములు ఉండేందుకు ఇది ఓ నివాస స్థలంగా ఉపకరిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఐ.ఎస్.ఎస్. నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు సుమారు 12.55 లక్షల కోట్ల రూపాయల్ని చెబుతున్నారు.

వాస్తవానికి దీని ప్రారంభ ఉద్దేశ్యం చంద్రుడు, అంగారక గ్రహం, గ్రహశకలాలకు భవిష్యత్తులో యంతరిక్ష యాత్రలకు స్టేజింగ్ గ్రౌండ్ గా పనిచేయడం. కానీ.. కాల క్రమేణా ఇది అంతరిక్ష పరిశోధనకు ఒక సోపాన రాయిగా కాకుండా మరింతగా పరిణామం చెందింది.