ఫస్ట్ విడతలో బొత్స రోజా పెద్దిరెడ్డి టీడీపీ టార్గెట్ ?
ఈ నేపధ్యంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది విషయంలో టీడీపీ ప్రయారిటీ బేసిస్ లో టార్గెట్ చేసింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2024 4:02 AM GMTటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ వైఫల్యాల మీద మంత్రులు నుంచి ముఖ్యమంత్రి దాకా మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి అవినీతి అక్రమాలు ప్రతీ మంత్రిత్వ శాఖలోనూ చోటు చేసుకున్నాయని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది విషయంలో టీడీపీ ప్రయారిటీ బేసిస్ లో టార్గెట్ చేసింది అని అంటున్నారు.
అందులో మొదటి విడతలో రోజా బొత్స పెద్దిరెడ్డి ఉన్నారని అంటున్నారు. వీరి మీదనే ఇపుడు ఆరోపణలు కూడా టీడీపీ నుంచి ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ముందుగా బొత్స సత్యనారాయణను తీసుకుంటే టీచర్ల బదిలీలలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఆయన మీద టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
అంటే మెల్లగా వర్క్ స్టార్ట్ అయింది అన్న మాట. ఇపుడు రోజా విషయానికి వస్తే ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉంటూ ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించరని అందులో స్కాం పెద్ద ఎత్తున జరిగిందని అంటున్నారు. దీని మీద విచారణ జరిపిస్తారని అంటున్నారు. అలాగే ఆమె టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. విశాఖలో టూరిజం భవనాలు అని చెప్పి అయిదు వందల కోట్లతో రుషికొండ మీద పాలెస్ నిర్మించారు అని అంటున్నారు. ఆ పాలెస్ నిర్మాణం కోసం ఖర్చు ఎంత పెట్టారు ఎంత దుర్వినియోగం అయింది. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారు అన్న దాని మీద విచారణ చేయాలని టీడీపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు.
ఇక మరో సీనియర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ శాఖను చూసినపుడు అవినీతి విచ్చలవిడిగా సాగిందని ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. దాంతో పెద్దిరెడ్డి విషయంలో కూడా గట్టిగానే బిగించాలని చూస్తున్నారు. అలాగే ఎర్ర చందనం అక్రమ రవాణా మీద కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ శాఖను చూసిన పెద్దిరెడ్డి మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మొత్తం మీద చూసుకుంటే ఈ ముగ్గురి మీద టార్గెట్ పెట్టారని అంటున్నారు. వీరి తరువాత వరసలోనే మిగిలిన శాఖలను చూసిన మాజీ మంత్రుల విషయానికి వస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే వంద కోట్ల బడ్జెట్ తో ఆడుదాం ఆంధ్రా నిర్వహించామని అది క్రీడల శాఖ ఆధ్వర్యంలో చేయలేదని రోజా అంటున్నారు. వంద కోట్లతో చేసిన దానిలో వంద కోట్ల అవినీతి ఎలా జరిగిందని అంటారని ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద బొత్స రోజా పెద్దిరెడ్డిల విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు మీదనే ఉంది అని వార్తలు వస్తున్నాయి.