Begin typing your search above and press return to search.

జగన్ రైట్ హ్యాండ్ బీజేపీలోకి చేరిక ?

వైసీపీ ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఏపీలో అధికార టీడీపీ కూటమి నుంచి దాడులు ఒక స్థాయిలో ఉంటాయని అపుడే సంకేతాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:41 PM GMT
జగన్ రైట్ హ్యాండ్ బీజేపీలోకి చేరిక ?
X

వైఎస్ జగన్ కి కుడి భుజం లాంటి నాయకుడు ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున చక్రం తిప్పిన నేత ఇపుడు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఆసక్తిని చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఏపీలో అధికార టీడీపీ కూటమి నుంచి దాడులు ఒక స్థాయిలో ఉంటాయని అపుడే సంకేతాలు వస్తున్నాయి.

వాటిని తట్టుకుని నిలబడడం అన్నది కష్టసాధ్యం అని భావించే సదరు నాయకుడు ముందు చూపుతో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. వైసీపీలో అత్యంత కీలక నాయకుడు నంబర్ టూ అని అనిపించుకున్న నేత బీజేపీలోకి వెళ్తారు అని టీడీపీకి చెందిన అనుకూల చానళ్ళు అయితే తెగ ఊదరగొడుతున్నాయి.

వారు ఊరకే చెప్పడంలేదు. దానికి లాజిక్ ని జోడించి మరీ తమ వాదనను గట్టిగా బలపరచుకుంటున్నాయి. సదరు నేత ఒకనాడు తన హవా బాగా ఉన్న కాలంలో విశాఖలో ల్యాండ్ సెటిల్మెంట్లను పెద్ద ఎత్తున చేశారు అని అంటున్నారు. తన అల్లుడికి కూడా పెద్ద ఎత్తున ల్యాండ్స్ భోగాపురం ఎయిర్ పోర్టు దగ్గర కట్టబెట్టారని ఆ విధంగా బాగానే భూ భాగోతం నడచింది అని అంటున్నారు.

ఆ నేత పెద్ద ఎత్తున భూములను తీసుకున్నారని ఈ విషయంలో సామ దాన భేద దండోపాయాలు కూడా ప్రయోగించి భూ దందా నడిపినట్లుగా టీడీపీ చానళ్ళు అయితే విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ బిగ్ షాట్స్ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తోంది. సీఐడీ విచారణకు ఆదేశించి ఈ భూ భాగోతాల మీద దూకుడు చేస్తే మాత్రం సదరు నేత జైలుకు వెళ్తారని కటకటాలు లెక్కబెడతారు అని కూడా టీడీపీ అనుకూల చానల్స్ లో ప్రచారం ధాటీగా సాగుతోంది.

ఇలా నాలుగు వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ నాయకుడు రెండో మాట లేకుండా బీజేపీలోకి జంప్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటామని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకోసం ఆయన చాలా సైలెంట్ గా తన వర్క్ ని కానిచ్చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఆయన ఏదో క్షణాన కమలం కండువా కప్పుకుంటారు అని అంటున్నారు.

ఆయనకు విశాఖలో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయన విశాఖలో అణువణువు జల్లెడ పట్టారు. వైసీపీ తరఫున పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూనే ప్రభుత్వం వచ్చిన తరువాత అంతా తాను అయ్యారని అప్పట్లోనే ప్రచారం సాగింది. విశాఖ నుంచి భోగాపురం దాకా చొచ్చుకుపోతూ ల్యాండ్ సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున చేస్తూ నాడు టీడీపీ నేతలకు కన్నెర్ర అయ్యారు.

వారు ఆనాడే సదరు నేతను హెచ్చరించారు. మా ప్రభుత్వం వస్తే మొత్తం భూ దందా లెక్కలను పక్కాగా సెటిల్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇపుడు అనుకున్నట్లుగానే టీడీపీ ప్రభుత్వం వచ్చింది. దాంతో వారంతా రెడీ అవుతున్నారు. ఇలా అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలు కావడం కనీసంగా కూడా ప్రతిపక్ష స్థానానికి సరిపడా సీట్లు తెచ్చుకోకపోవడంతో సదరు నేత గుండెలల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. దాంతో ఆ నేత బీజేపీ నీడ తనకు బెస్ట్ అనుకుంటున్నారుట.

వైసీపీ అధినాయకత్వానికి దీని మీద ఉప్పు అందిందని అందుకే ఆయనకు ప్రాధాన్యత మెల్లగా తగ్గిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో బిగ్ షాట్ గా ఉన్న ఆ నేత బీజేపీ తీర్ధం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాకింగ్ గానే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.