Begin typing your search above and press return to search.

న్యాయం జీవితకాలం లేటు.. వందమంది బాలికలపై అత్యాచారం..32 ఏళ్లకు శిక్ష

సమాచార మాధ్యమాలు పెద్దగా లేని ఆ కాలంలో కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 11:30 PM GMT
న్యాయం జీవితకాలం లేటు.. వందమంది బాలికలపై అత్యాచారం..32 ఏళ్లకు శిక్ష
X

న్యాయం జీవిత కాలం లేటు అంటే ఇదేనేమో..? ఎప్పటి 1992.. ఎప్పటి 2024..? ఒకరు ఇద్దరు కాదు.. వందమంది బాలికలపై అత్యాచారం.. అది కూడా 18 మంది.. కానీ, పూర్తి న్యాయం మాత్రం జరగలేదు.. ఇన్నాళ్లకు బాధితులకు సాంత్వన లభించింది. ఇంతకూ ఏం జరిగిందంటే..? 1992 ప్రాంతంలో రాజస్థాన్ లో 100 మందికి పైగా పాఠశాల, కళాశాల బాలికలపై సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమాచార మాధ్యమాలు పెద్దగా లేని ఆ కాలంలో కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో 9 మందికి శిక్ష పడింది. ఒక నిందితుడు మరో కేసులో జైలులో ఉన్నాడు. ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నాడు. మిగిలిన ఆరుగురిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి తీర్పు రాలేదు.

అజ్మేర్ లో హల్ చల్

1992లో ఇది రాజస్థాన్ లోని అజ్మేర్ లో జరిగింది. కాలేజీకి వెళ్లే అమ్మాయిల నగ్న చిత్రాలు హల్ చల్ చేశాయి. నిందితుల్లో నలుగురు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు 2003లో నలుగురి శిక్షను యావజ్జీవం నుంచి 10 సంవత్సరాలకు తగ్గించింది. నిందితులు ఇప్పటికే 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యారు. మిగిలిన ఆరుగురు నిందితులకు ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్క‌రికి రూ.5 లక్షల చొప్పున జరిమానా వేసింది. నిందితులు నఫీస్ చిస్తీ, నసీమ్ అలియాస్ టార్జాన్, సలీం చిస్తీ, సోహిల్ ఘని, సయ్యద్ జమీర్ హుస్సేన్, ఇక్బాల్ భాటిలను దోషులుగా నిర్ధారించింది

అజ్మీర్‌ లో నాడు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఫారూఖ్‌ చిస్తీతో అత‌డి స్నేహితులు.. ఫామ్‌ హౌస్‌లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడ్డారు. అమ్మాయిల నగ్న చిత్రాలు తీసేవారు. వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వారితోపాటు వేరే అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు.

పలుకుడితో ఫిర్యాదుల్లేవ్..

నిందితుల‌కు వ్యతిరేకంగా కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఫిర్యాదు చేయగలిగారు. అప్పట్లో పోలీసులు కూడా ఈ విషయమై చర్యలు తీసుకోలేకపోయారు. ధైర్యం చేసిన కొందరు బాలికలు పోలీసులను ఆశ్రయించినా బెదిరింపులు మొదలయ్యాయి. చివరకు 18 మంది బాధితులు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.