జంపింగులకు జడిసే రకమా ఇది!!
కానీ, ఏపీలో అధికా రంలో ఉన్న పార్టీ వైసీపీ.. మాత్రం ఎక్కడా జంకు లేకుండా ముందుకు ఉరుకులు పెడుతోంది.
By: Tupaki Desk | 28 Dec 2023 7:16 PM GMT"అసలు ఇలా కూడా జరుగుతుందా?`` అని అనుకోనివారు లేరు. పైగా.. కాకలు తీరిన నాయకులు ఉన్న ప్రతిపక్ష పార్టీలలోనూ ఇదే చర్చ సాగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఊహించని మార్పులు.. సంచలన నిర్ణయాలు.. ఇవీ.. ఎన్నికలకు నాలుగు మాసాల ముందు వైసీపీలో జరుగుతున్న రాజకీయ వ్యూహాలు. ప్రతిపక్షాలే చేయలేని సాహసాలు.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నాయి. సహజంగా అధికారం లో ఉన్న పార్టీ పెద్దగా ప్రయోగాలు చేయదు.
ఎందుకంటే.. అప్పటికే అంతో ఇంతో ఉన్న ప్రజావ్యతిరేకతకు తోడు.. నాయకులను మారిస్తే.. వారు రెబ ల్‌గా మారిపోతే.. పరిస్థితి ఏంటనేది అధికార పార్టీలో సహజంగానే తర్జన భర్జన సాగుతుంది. అందుకే మె జారిటీ నాయకులను మార్చేందుకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇష్టపడదు. కానీ, ఏపీలో అధికా రంలో ఉన్న పార్టీ వైసీపీ.. మాత్రం ఎక్కడా జంకు లేకుండా ముందుకు ఉరుకులు పెడుతోంది. మార్పు లు అనివార్యమని గ్రహించిన వైసీపీ ఆ దిశగా కొత్త ముఖాలను జొప్పిస్తోంది.
ఈ క్రమంలో జంపింగులు తెరమీదికి వస్తున్నాయి. ఇదేసమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా.. నాయ కులను తీసుకుంటామని బహిరంగ ప్రకటనలే చేస్తోంది. ``సానుకూలత ఉన్న నాయకులను తీసుకునేం దుకు సిద్ధమే`` అంటూ చంద్రబాబు ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో వైసీపీలో చాలా మంది నాయ కులు వెళ్లిపోతారనే చర్చ సాగుతోంది. అయితే.. దీనివల్ల వైసీపీలో విస్పోటం వచ్చేస్తుందని.. సీఎం జగన్ డీలా పడిపోతారని.. ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు.
కానీ, వాస్తవానికి వైసీపీకి జంపింగులు కొత్తకాదు. ఎదురు దెబ్బల నుంచి ఎన్నో పాఠాలు నేర్చిన పార్టీ ఇది. గత 2019 ఎన్నికలకు ముందు .. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా.. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కొందరు నాయకులు తిరుగుబావుటా ఎగరేసినా.. మడమ తిప్పలేదు. వెనక్కి తగ్గలేదు. అలాగని.. ప్రజాభిమానం ఉండి. ప్రజాక్షేత్రంలో గెలుపు గుర్రం ఎక్కుతారని భావించిన వారిని ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరీ తెచ్చి సీటు ఇచ్చింది. సో.. ఇప్పుడు కూడా అంతకు మించిన వ్యూహంతోనే వైసీపీ అడుగులు వేస్తోందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ``వెళ్లేవారిని వెళ్లనీయండి. జంపింగులకు జడిసే రకమా ఇది(జగన్)`` అంటున్నారు