Begin typing your search above and press return to search.

కౌంటింగ్ వేళ వేణుస్వామి ఎంట్రీ... జగన్ కు షాకింగ్ న్యూస్!

ఈ సమయంలో ఆయా పార్టీల నేతలు ధీమాగా చెబుతున్నప్పటికీ.. కేడర్ లో మాత్రం ఆందోళన అలానే ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 5:47 PM GMT
కౌంటింగ్  వేళ వేణుస్వామి ఎంట్రీ... జగన్  కు షాకింగ్  న్యూస్!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఆయా పార్టీల నేతలు ధీమాగా చెబుతున్నప్పటికీ.. కేడర్ లో మాత్రం ఆందోళన అలానే ఉందని అంటున్నారు. ఈ సమయంలో 2019 కంటే ఎక్కువ సీట్లే సాధిస్తామని జగన్ తెలిపారు. ఈ సమయంలో వేణుస్వామి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యపై జోస్యం చెప్పారు.

అవును... సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ "సెలబ్రెటీ జ్యోతిష్యుడు"గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రధానంగా... సమంత, నాగచైతన్యలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు వేణు స్వామి. ఆయన చెప్పాకే వారు విడిపోయిన పరిస్థితి.

ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా ప్లాప్ మొదలైన విషయాలపై ఆయన చెప్పిన జోస్యం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వేణుస్వామి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. చీకట్లో వేసిన బాణాలు తగిలేస్తున్నాయని కొందరు అంటున్నా.. జాతకాలు నమ్మే మరికొంతమంది మాత్రం ఈయన చెప్పిన జోస్యంపై నమ్మకంగా ఉంటారు!

ఇక రాజకీయ నాయకుల జోస్యాల విషయానికొస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని వేణుస్వామి చెప్పడం.. అనంతరం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సుమారు 53 రోజులు ఉండటం తెలిసిందే. కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం విషయం కూడా ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ఫలితాలపైనా తాజాగా స్పందించారు వేణుస్వామి. ఇందులో హాగంగా... వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ 79 సీట్లలో వన్ సైడ్‌ గా గెలుస్తుందని తెలిపారు. అదేమిటి జగన్ 150 ప్లస్ అంటున్న సమయంలో లెక్క 79కి దించేశారు అనుకునేలోపు మిగితా భాగాన్ని ఆయన వెల్లడించారు.

ఇందులో భాగంగా... 79 సీట్లలో వన్ సైడ్‌ గా గెలుస్తుండటంతోపాటు 30 నుంచి 40 సీట్లలలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపారు. ఏది ఏమైనా... ఫైనల్ గా 95 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. కాకపోతే 150 ప్లస్ అని చెప్పకపోవడం గమనార్హం.

ఆ సంగతి అలా ఉంటే... అక్కడితో ఆగని వేణుస్వామి 2024లోనే కాదు 2029 ఎన్నికల్లో కూడా జగన్ గెలుస్తారని, హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో ఏపీలోని ఓ రాజకీయ పార్టీ కనుమరుగు అవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పడం గమనార్హం. మరి ఈయన జోస్యం నిజం అవుతుందో లేదో తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే!