ఆ ఓటింగ్ ముంచేది ఎవరిని ? తేల్చేది ఎవరిని ?
గ్రామీణ ప్రాంతాలలో భారీగా పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది ? అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.
By: Tupaki Desk | 1 Jun 2024 2:14 PM GMTఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఎవరిది ? వైసీపీ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలలో వేసిన నిధులు ఈవీఎం యంత్రాలలో ఓట్లు రాలుస్తాయా ? మహిళా ఓటర్లు, కొత్తగా ఓట్లు వచ్చిన వారు ఎవరి వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాలలో భారీగా పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది ? అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.
మే 13న జరిగిన పోలింగ్ లో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 శాసనసభ స్థానాలలో 124 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం 2019 కన్నా ఎక్కువ పెరిగింది. 26 శాసనసభ స్థానాలలో 0 నుండి 1 శాతం, 34 శాసనసభ స్థానాలలో 1 నుండి 1.99 శాతం, 64 శాసనసభ స్థానాలలో 2 నుండి 7.53 శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. 0 నుండి 1.92 శాతం ఓట్లు 19 నియోజకవర్గాలలో తక్కువగా పోలయ్యాయి.
పట్టణ ప్రాంతంలో 27 శాసనసభ స్థానాలలో 0.31 నుండి 13.48 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. 5 నియోజకవర్గాలలో 2.78 శాతం నుండి 0.58 శాతం తక్కువ ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 1.57 కోట్ల మహిళలు 79.56 శాతం ఓట్లు పోలింగ్ కాగా, ఈ ఎన్నికలలో 80.30 శాతం ఓట్లు పోల్ కాగా 1.69 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన ఓటింగ్ శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎటువైపు మొగ్గుచూపుతుంది అన్న ఉత్కంఠ నెలకొన్నది.