ఐటీ శాఖ కీలక నివేదిక... దేశంలో ఇంతమంది కోటీశ్వరులున్నారా?
ఇందులో భాగంగా.. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ లో ఒక కోటి కంటే ఎక్కువ పన్ను విధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2024 2:30 AM GMTభారతదేశం అభివృద్ధి చెందిన దేశమా.. పేద దేశమా.. అని అంటే... అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని కొందరు అంటే, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్న దేశం అన్ని మరికొందరు అంటుంటారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. భారతదేశంలో ధనవంతుల జాబీతా మాత్రం వేగంగా పెరుగుతుందని చెప్పే నివేదిక తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... పరిమితికి మించిన ఆదాయం ఉన్నవరంతా ఐటీ రిటన్స్ ఫైల్ చేస్తారనేది తెలిసిందే! దీని కోసం ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం, వ్యవం వివరాలను తెలుపుతూ ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఇలా ఐటీఆర్ సమర్పిస్తున్న వారిలో కోటి కంటే ఎక్కువ ఆదాయం చూపుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా.. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ లో ఒక కోటి కంటే ఎక్కువ పన్ను విధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాంటి వారి సంఖ్య 2013-14 అసెస్మెంట్ ఇయర్ లో 44,078గా ఉండగా.. 2023-24కి వచ్చే సరికి వారి సంఖ్య 23 లక్షలకు పెరిగిందని తెలుస్తోంది.
ఇదే సమయంలో ఐటీఆర్ లు అందజేసే వారి సంఖ్య కూడా 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరగిందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... వార్షియ పన్ను ఆదాయాన్ని రూ.500 కోట్లకు మించి ఉన్నట్లు ఐటీఆర్ దాఖలు చేసిన వారిలో 23 మంది జీతం పొందడం లేదు కానీ... రూ.100 నుంచి రూ.500 కోట్ల మధ్య ఉన్న 262 మందిలో 19 మంది మత్రమే జీతం పొందుతున్నారని చెబుతున్నారు.
వీరి సంఖ్య 2013-14లో రెండుగా ఉండటం గమనార్హం. ఇక.. అసెస్మెంట్ ఇయర్ 2023లో రూ.4.5 లక్షల నుంచి రూ.9.5 లక్షల విభాగంలో ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య 52 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు. దేశంలో దాఖలయ్యే ప్రతీ నాలుగు ఐటీఆర్ లలో ఒకటి రూ.5.5 నుంచి 9.5 లక్షలు ఉండగా.. ప్రతీ ఐదింటిలో ఒకటి రూ.2.5 నుంచి 3.5 లక్షల విభాగంలో ఉంది.