Begin typing your search above and press return to search.

ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

అవును... ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తాజాగా ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2023 8:12 AM GMT
ఇస్లాం మతంపై ఇటలీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
X

యురోపియన్ కంట్రీస్ లో ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయంనే కథనాలొస్తున్న వేళ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా యూరప్ దేశాల్లో ఇస్లాంకు చోటు లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇస్లాం సంస్కృతిలో విలువలు, హక్కులు మొదలైన విషయాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం రేగింది.

అవును... ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తాజాగా ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్‌ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే యూరప్‌ లో ఇస్లాంకు చోటు ఉండబోదని ఆమె తెలిపారు. ఇస్లామిక్ సంస్కృతి, యూరోపియన్ నాగరికత విలువలు, హక్కుల మధ్య అనుకూలత సమస్య ఉందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని షరియా చట్టాల గురించి పరోక్షంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని విమర్శలు గుప్పించారు. ఇస్లాం సంస్కృతికి, తమ యూరోపియన్‌ నాగరికతకు చాలా తేడాలు ఉంటాయని ఆమె అన్నారు. ఇదే క్రమంలో... ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్‌ సెంటర్లకు సౌదీ అరేబియా నిధులు అందిస్తుందని ఆమె ఆరోపించారు.

అది ఏమాత్రం సరైంది కాదని... ఆ విషయంలో కూడా తనకు సదాభిప్రాయం లేదని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో... సౌదీ అరేబియాలో పాటిస్తున్న షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు. ఆ దేశ షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం లాంటి విధానాలు తీవ్రమైన నేరాలని మెలోనీ తెలిపారు.

దీని ప్రకారం ఇటలీలో ఇస్లాం షరియా చట్టాన్ని అమలు చేయడానికి అనుమతించమని ఆమె తేల్చి చెప్పారు. షరియా అంటే... వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని చెప్పిన ఆమె.. యూరప్‌ లోని తమ నాగరికత విలువలకు, ఇస్లాం విధానాలకూ మధ్య చాలా తేడాలు ఉన్నాయని పునరుధ్ఘాటించారు.

రోమ్‌ లో అతివాద పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్వహించిన సభలో మెలోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.