Begin typing your search above and press return to search.

డీక్ ఫేక్ బాధిత ప్రధాని.. న్యాయం కోసం కోర్టుకు..

అనేక విధాలుగా డెవలప్ అయిన యూరప్ దేశాల్లోనూ డీప్ ఫేక్ జాడ్యం ఉంది. సాక్షాత్తు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ ఫేక్‌ బాధితురాలే.

By:  Tupaki Desk   |   21 March 2024 9:30 AM GMT
డీక్ ఫేక్ బాధిత ప్రధాని.. న్యాయం కోసం కోర్టుకు..
X

ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన అంతం డీప్ ఫేక్. సినీ నటి రష్మిక అర్థనగ్నంగా లిఫ్ట్ లోకి ఎక్కుతున్నట్లు బయటకు వచ్చిన వీడియో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. రష్మిక ఒక్కరే కాదు.. చాలామంది డీఫ్ ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పరిణామంపై సాక్షాత్తు భారత ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. భారత్ లోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ డీఫ్ ఫేక్ బాధితులు ఉన్నారని తర్వాత తెలిసింది.

మహిళా ప్రధాని బాధితురాలు

అనేక విధాలుగా డెవలప్ అయిన యూరప్ దేశాల్లోనూ డీప్ ఫేక్ జాడ్యం ఉంది. సాక్షాత్తు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ ఫేక్‌ బాధితురాలే. ఇప్పుడు ఆమె ఈ కంటెంట్‌ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా బాధితురాలినంటూ మీడియా ఎదుటకు వచ్చారు.

లక్ష యూరోలకు దావా..

తనపై రూపొందించిన డీఫ్ ఫేక్ వీడియోలను అప్‌ లోడ్‌ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు జార్జియా మెలోని. ఓ పో*ర్న్‌ స్టార్‌ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్‌ చేసి అప్ లోడ్‌ చేశారు ఇద్దరు. ఈ వీడియోలను అమెరికాలో కొన్ని నెలలుగా లక్షల మంది వీక్షించారు. ఇది మెలోనీ దృష్టికి వెళ్లడంతో ఆమె సత్వరమే స్పందించారు.

నిందితులు తండ్రీకొడుకులు

తనపై డీప్ ఫేక్ వీడియోలను అప్ లోడ్ చేసినది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించిన జార్జియా మెలోనీ.. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(రూ.90 లక్షలు) పరువు నష్టం దావా వేశారు. అయితే, విచారణ మాత్ర జూలై 2న జరగనుంది. అదే రోజు మోలోని కోర్టుకు హాజరు కానున్నారు. ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ధైర్యంగా పోరాడాలని మెలోనీ పిలుపు ఇచ్చారు. నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా ఇస్తామని ఆమె టీమ్ ప్రకటించింది.

మెలోనీపై డీప్ ఫేక్ వీడియోలను రూపొందించినది తండ్రీ కొడుకులుగా గుర్తించారు. వీరి యవసు 40, 72 ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేగాక స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా వీడియోలను అప్‌ లోడ్‌ చేసినట్లు నిర్ధారించారు. గమనార్హం ఏమంటే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో డీప్ ఫేక్ వీడియోలు అప్‌ లోడ్‌ అయ్యాయి. ఇటలీ చట్టాల ప్రకారం పరువు నష్టం దావాలు తీవ్రమైన నేరాలు. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.