నారా లోకేష్...ఈ టెర్మ్ లోనే సీఎం గా !?
అయిదేళ్ల విరామం తరువాత టీడీపీ కనుక అధికారం చేపడితే ఆ లెక్క కిక్కూ వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 25 May 2024 3:27 PM GMTనారా లోకేష్ పేరు ఇపుడు టీడీపీలో మారుమోగుతోంది. టీడీపీ కూటమి గెలుస్తుంది అని భారీ అంచనాల నడుమ మరి కొద్ది రోజుల వ్యవధిలో కౌంటింగ్ మొదలవబోతోంది. అయిదేళ్ల విరామం తరువాత టీడీపీ కనుక అధికారం చేపడితే ఆ లెక్క కిక్కూ వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు.
ఒక సైలెంట్ వేవ్ ఏపీలో బలంగా సాగిందని అంటున్నారు. అది టీడీపీ కూటమికే అనుకూలం అని నమ్ముతున్నారు. అదే నిజమైతే టీడీపీకి సోలోగా వందకు పైగా సీట్లు ఈజీగా వస్తాయని లెక్క వేస్తున్నారు. దాంతోనే టీడీపీలో లోకేష్ నామ జపంతో పార్టీ యూత్ వింగ్ అంతా తరిస్తోంది.
లోకేష్ ని పార్టీ ప్రెసిడెంట్ చేయమని అపుడే బుద్ధా వెంకన్న లాంటి వారు డిమాండ్ చేశారు. నిజానికి ఆయనకు టీడీపీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దానికి సూచనగా ఈ డిమాండ్ ఉందని అంటున్నారు. చంద్రబాబు టీడీపీ జాతీయ ప్రెసిడెంట్ అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయనకు ఈ పదవి చాలా కీలకంగా ఉంది.
జాతీయ అధ్యక్షుడుగా బాబే ఉంటారు అని అంటున్నారు. మరి సడెన్ గా వచ్చిన వచ్చిన ఈ డిమాండ్ వెనక ఆంతర్యం ఏమిటి అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. చంద్రబాబు మంత్రివర్గంలో లోకేష్ కి కీలకమైన శాఖలు ఇవ్వడం కోసమే అని అంటున్నారు. చంద్రబాబుతో పాటే లోకేష్ కూడా నంబర్ టూ గా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు.
అంటే పార్టీ పరంగానూ కీలకంగా ఉంటూ ప్రభుత్వంలోనూ నంబర్ టూ గా ఉండేలాగానే ఇదంతా అని అంటున్నారు. 2024 నుంచి 2029 మధ్య అయిదేళ్ళ కాలం లోకేష్ వరకూ చాలా ముఖ్యమైనది అని చెబుతున్నారు. ఈ అయిదేళ్ల కాలంలో ఇంకా చెప్పాలంటే ఈ టెర్మ్ లోనే లోకేష్ ని సీఎం గా చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు అని అంటున్నారు.
పార్టీలో జూనియర్ నేతల డిమాండ్ వెనక అర్ధం పరమార్ధం కూడా ఇదే అని అంటున్నారు. లోకేష్ ని ఈ అయిదేళ్ల కాలపరిమితిలో ఏదో ఒక సందర్భంలో సీఎం గా చేసి 2029 నాటికి ఆయనను సీఎం హోదాలోనే జనాల్లోకి పంపించాలి అన్నది ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.
బుద్ధా వెంకన్న వంటి వారి డిమాండ్ల వెనక పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. లోకేష్ ని బలమైన నేతగా సీఎం గా చూపించినట్లు అయితేనే టీడీపీకి మరో ముప్పయ్యేళ్లకు సరిపడా జవసత్వాలు వస్తాయని అంటున్నారు. లోకేష్ ని ప్రభుత్వంలో నంబర్ టూ హోదాలో ఉంచుతూ సరైన సమయంలో ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ప్లాన్ ఉందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే చంద్రబాబు ఫుల్ టైం సీఎం కారని, మధ్యలోనే ఆయన తప్పుకుని కుమారుడికి సీఎం పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే పార్టీ పగ్గాలు లోకేష్ కి ఇవ్వాలని బయటకు వస్తున్న డిమాండ్ వెనక అసలు అర్ధాలు వేరు అని అంటున్నారు. ముఖ్యమంత్రిగా లోకేష్ ని ప్రకటించడం కోసం ఇదంతా కసరత్తుగా చెబుతున్నారు.
తెలంగాణాలో చూస్తే రెండు సార్లు కేసీఆర్ సీఎంగా ఉన్నా కేటీఆర్ కి చాన్స్ దక్కలేదు. మూడవసారి గెలిస్తే ఇస్తారు అని అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ అన్నట్లుగా పార్టీ ఓడింది. ఏపీలో అలాంటి వాతావరణం లేకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తీరులోనే లోకేష్ ని ముఖ్యమంత్రిగా చివరి రెండేళ్ళు అయినా చేస్తారు అని అంటున్నారు.
అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తొలి మూడేళ్ళు బాబు సీఎం గా ఉంటారని చివరి రెండేళ్ళు లోకేష్ బాబే సీఎం అని అంటున్నారు. మొత్తానికి ఈసారి టీడీపీ అధికారం లోకేష్ కోసమే అన్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఫలితాల తరువాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో.