Begin typing your search above and press return to search.

ట్రంప్ ని వెంటాడుతున్నారా?... పార్టీ మీటింగ్ వద్ద ఏకే 47తో ఉన్న వ్యక్తి!

ఆ సంగతి అలా ఉంటే... ట్రంప్ పై హత్యాప్రయత్నం విఫలమైన కొన్ని రోజుల్లోనే నేషనల్ కన్వెన్షన్ సమీపంలో అరెస్టైన వ్యక్తి వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   17 July 2024 3:53 AM GMT
ట్రంప్  ని వెంటాడుతున్నారా?... పార్టీ మీటింగ్  వద్ద ఏకే 47తో ఉన్న వ్యక్తి!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు భారీగా మెరుగుపడ్డాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ట్రంప్ పై హత్యాప్రయత్నం విఫలమైన కొన్ని రోజుల్లోనే నేషనల్ కన్వెన్షన్ సమీపంలో అరెస్టైన వ్యక్తి వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాప్రయత్నం విఫలమైన కొన్ని రోజులకే... రిపబ్లికన్ నేషనల్ కన్వెషన్ సమీపంలో మాస్క్ ధరించిన ఓ సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి. అయితే... ఆ వ్యక్తి తన వీపుకు తగిలించుకున్న బ్యాగులో ఏకే 47 తుపాకీ మోసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇదే సమయలో.. ఆ బ్యాగ్ లో బుల్లెట్స్ మ్యాగజైన్ కూడా ఉందని అంటున్నారు.

దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న ట్రంప్ ని హత్యచేయడానికి ప్రయతించిన ఘటనలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ ని కాల్చివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో... ట్రంప్ ను వెంటాడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి!

మరోవైపు ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని అంటున్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ పై కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇది జరిగిందని చెబుతున్నారు. దీంతో... ఆయనకు సీక్రెట్ సర్వీస్ వెంటనే భద్రతను పెంచిందట. అయితే... ట్రంప్ పై కాల్పులు జరిపిన క్రూక్స్ కు ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు.

అయితే ఆయనకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే... ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భదరతను భారీగా పెంచినట్లు చెబుతున్నారు. ట్రంప్ కు పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి తమకు నిరంతరం సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ అధికారి ఆంథోనీ గుగ్లియెల్మీ తెలిపారు. దానికి అనుగుణంగానే భదరతా వనరులను సర్దుబాటు చేస్తున్నామని వివరించారు.

కాగా... గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసీం సులేమానీ ని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో... నాటి నుంచి ట్రంప్ కు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.