Begin typing your search above and press return to search.

రీఫండ్ల కోసం కక్కుర్తి వద్దు.. అడ్డంగా బుక్ అయిపోతారంతే

ఆదాయపన్ను చెల్లింపుదారులకు రానున్న రెండు రోజులు చాలా ముఖ్యమైనవి.

By:  Tupaki Desk   |   29 July 2024 5:15 AM GMT
రీఫండ్ల కోసం కక్కుర్తి వద్దు.. అడ్డంగా బుక్ అయిపోతారంతే
X

ఆదాయపన్ను చెల్లింపుదారులకు రానున్న రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే.. వార్షిక ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయాలనుకునే వారికి జులై 31 గడువు తేదీ. ఈ తేదీ లోపు ఐటీ రిటర్న్ దాఖలుచేస్తే ఫర్లేదు. లేదంటే.. ఆ తర్వాత నుంచి భారీగా ఫైన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. వేతన జీవుల్లో దాదాపు ఐటీ రిటర్న్ దాఖలు చేస్తుంటారు. అయితే.. రిటర్న్స్ దాఖలు చేసే వేళలో కొందరు ఇచ్చే తప్పుడు సలహాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫాలో కాకూడదు.

తప్పుడు ఖర్చుల్ని చూపించటం.. దొంగ లెక్కలతో అక్రమ పద్దతులకు పాల్పడటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. పన్ను కోతలను అధికంగా పేర్కొంటూ.. కట్ అయిన ఆదాయపన్ను మొత్తాన్ని వెనక్కి తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలు రిస్కుతో కూడుకున్నవన్న విషయాన్ని మర్చిపోకూడదు. చాలామంది తప్పుడు అద్దె బిల్లుల్ని.. ఇతర అంశాలకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లను జత చేస్తుంటారు.

మరికొందరు తమ వివరాల్ని తప్పుగా పేర్కొనటం ద్వారా ఆదాయపన్ను ఖాతాకు జమ అయిన మొత్తాన్ని రీఫండ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుంటారు. కానీ.. అది రిస్కుతో కూడుకున్న వ్యవహారంగా చెబుతున్నారు. ఎందుకుంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత ర్యాండమ్ గా స్క్రూట్రీ చేపడతారు. ఆ సందర్భంలో తప్పుడు పత్రాలతో ఫైల్ చేసినట్లుగా తేలితే భారీ ఫైన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తప్పుడు పత్రాలతో.. లెక్కలతో ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయొద్దని ఆదాయపన్ను శాఖ హితవు పలుకుతోంది. జులై 31 నాటికి 2023-24 వార్షిక ఐటీ రిటర్న్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. జులై 26 నాటికి దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది ఐటీఆర్ లు దాఖలు చేశారు. రీఫండ్లు పెట్టుకున్న వారికి డబ్బులు జమ కావటం ఆలస్యమైన పక్షంలో ఐటీఆర్ పోర్టర్ లో నమోదు చేసుకోవాలని సూచన చేస్తోంది.