Begin typing your search above and press return to search.

జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే...?

ఇన్ కం ట్యాక్స్ చెల్లించే విషయంలో ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ దాటిపోతే పరిస్థితి ఏమిటి

By:  Tupaki Desk   |   31 July 2023 10:53 AM GMT
జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే...?
X

ఇన్ కం ట్యాక్స్ చెల్లించే విషయంలో ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ దాటిపోతే పరిస్థితి ఏమిటి.. తర్వాత ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. మరొక ఛాన్స్ ఏమైనా ఉంటుందా.. తాజాగా ఈ విషయాలపై సంబంధిత శాఖ చెబుతున్న విషయాలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజు (జూలై 31 - సోమవారం)తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువడుతున్న సమాంచారం మేరకు... జులై 30 సాయంత్రం సమయానికి సుమారు 6 కోట్ల మంది వరకూ ట్యాక్స్‌ పేయర్లు ఇన్ కం టాక్స్ రిటన్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఐటీ శాఖ ఇచ్చిన డెడ్‌ లైన్‌ జులై 31లోపు ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్‌ చేయకపోతే... ఆలస్య రుసుము కింద రూ.5,000 చెల్లించాలి. అనతరం ఈ ఏడాది డిసెంబర్‌ 31లో మరోసారి ఐటీఆర్‌ లు దాఖలు చేసుకోవచ్చు.

అయితే ఈ రూ.5000 ఆలస్య రుసుము అందరికీ వర్తించదు. మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే పన్ను చెల్లింపుదారులు చెల్లిస్తే సరిపోతోంది. ఒకవేళ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి లేట్‌ ఫీ ఛార్జీలు వర్తించవు.

మరోపక్క నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్‌ ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్‌ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్‌ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్‌ ను ఆదా చేసుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఇదే సమయంలో పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే... జరిమానాలతో పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రుసుములు రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్‌ లను ఆలస్యంగా దాఖలు చేస్తే... 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని అంటున్నారు.