Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఐటీ సోదాలు.. ఏపీలోని ముఖ్యనాయకుడికి టెన్షన్

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఒక ప్రముఖ మైనింగ్ వ్యాపారంలో ఉన్న పెద్ద మనిషికి చెందిన సంస్థల్లో వరుస పెట్టి ఐటీ సోదాలు నిర్వహిస్తున్న వైనం కలవరపాటుకు గురి చేస్తోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:23 AM GMT
తెలంగాణలో ఐటీ సోదాలు.. ఏపీలోని ముఖ్యనాయకుడికి టెన్షన్
X

కీలకంగా మారిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద అందరి చూపు పడుతోంది. పోటా పోటీగా మారిన ఈ ఎన్నికల ఫలితాలు కచ్ఛితంగా మరో ఆర్నెల్ల తర్వాత జరిగే ఏపీ ఎన్నికల మీద ప్రభావం చూపటం ఖాయమంటున్నారు. అంతేకాదు.. ఐదు రాష్ట్రల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం కేంద్రంలోని మోడీ సర్కారు తీరుకు తగ్గట్లే ఫలితాలు వెలువడే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఒక ప్రముఖ మైనింగ్ వ్యాపారంలో ఉన్న పెద్ద మనిషికి చెందిన సంస్థల్లో వరుస పెట్టి ఐటీ సోదాలు నిర్వహిస్తున్న వైనం కలవరపాటుకు గురి చేస్తోంది. తెలంగాణలో ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలపైనా.. ఆఫీసులపైనా ఐటీ సోదాల్నినిర్వహించారు. సదరు పెద్ద మనిషికి చెందిన సంస్థల్లో జరిగిన సోదాలు ఏపీలోని ఒక రాజకీయ పార్టీలో కలకలాన్ని రేపుతున్నట్లు చెబుతున్నారు.

ఎందుకంటే సదరు కాంట్రాక్టర్ కమ్ వ్యాపారవేత్తకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇతగాడి ప్రత్యేకత ఏమంటే.. ఎన్నికల సమయంలో తన వారికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమీకరించటం.. గుట్టుచప్పుడు కాకుండా అవసరమైన చోటుకు తరలించే సత్తా ఆయన సొంతంగాచెబుతారు. ఈ మధ్యన జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆయన ద్వారా కొందరికి నిధులు అందాయన్న ఆరోపణ ఉంది.

ఈ నేపథ్యంలో.. ఈసారి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల వేళ.. అటు నుంచి ఇటు వైపునకు నిధుల చేరవేత దిశగా ప్లానింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనపై ఐటీ శాఖ నిఘా పెట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన సోదాలు.. ఏపీకి చెందిన ఒక కీలక నేతకు టెన్షన్ పెట్టించినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. సదరు కీలక నేతకు సంబంధించిన ఆర్థిక వనరుల్ని సైతం ఈ వ్యాపారవేత్త మొయింటైన్ చేస్తుంటారని చెబుతున్నారు.

ఏదైనా తేడా వచ్చి.. ఆ గుట్టు రట్టు అయితే మొదటికే మోసం వస్తుందని.. మరో ఆర్నెల్లలో కీలకమైన ఎన్నికలు ఏపీలో కూడా జరగనున్న నేపథ్యంలో ఆయన కిందా మీదా పడుతున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు అవసరమైన నిధుల కోసం సదరు వ్యాపారవేత్త దగ్గర భారీగా నిధుల్ని ఉంచారని.. తాజా సోదాల్లో ఆ లెక్క బయటకు వస్తే కొత్త చిక్కుముడులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.