Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాల తర్వాత అమరావతిలో ఏం జరుగుతోంది?

గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరగటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:26 AM GMT
ఎన్నికల ఫలితాల తర్వాత అమరావతిలో ఏం జరుగుతోంది?
X

అవును.. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పట్టించుకోని అధికారులు.. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి అక్కడి పరిస్థితుల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించటంతో రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరగటం తెలిసిందే. ఈ ప్రాంతానని పట్టించుకోకుండా గడిచిన ఐదేళ్లుగా అలా వదిలేయటం తెలిసిందే. ఇప్పుడు అక్కడ పెరిగిన పిచ్చి మొక్కల్ని తొలగిస్తున్నారు. రోడ్లను అద్దాల మాదిరి మారుస్తున్నారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారిని శుభ్రం చేయటంతో పాటు.. రోడ్డు మీద ఉన్న విద్యుత్ దీపాలకు సైతం రిపేర్లు చేస్తున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రమాణస్వీకార ప్రాంతం మొత్తాన్ని హైసెక్యూరిటీ జోన్ గా మార్చేశారు. మొత్తంగా గడిచిన ఐదేళ్లుగా ఎవరికి పట్టని రాజధాని ప్రాంతానికి ఇప్పుడు కొత్త కళ వచ్చినట్లైంది. రాజధాని హడావుడి మొదలైంది. మొత్తంగా మార్పు కొట్టొచ్చినట్లుగా మొదలైందని చెప్పక తప్పదు. ఇంతకాలం రాజధాని ప్రాంతాన్ని పట్టించుకోని సీఆర్డీఏ తీరులోనూ మార్పు రావటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే యథా రాజా.. తధా ప్రజ అన్న సామెత గుర్తుకు రాక మానదు.